Payment Gateway Company : సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. దీనిలో భాగంగా సైబర్ క్రైం గురించి నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉంటారు.. అయినప్పటికీ సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. ఓ సంస్థపై దాడికి తెగబడిన సైబర్ నేరగాళ్లు.. అరగంట వ్యవధిలోనే 1.28 కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పేమెంట్ గేట్‌వే సంస్థ కార్యాలయంపై సైబర్ నేరగాళ్లు దాడికి తెగబడి కోట్లు కొల్లగొట్టారు. కేవలం అరగంట వ్యవధిలోనే ఖాతా నుంచి రూ.1.28 కోట్లు కొల్లగొట్టారు. ఈ సొమ్మును 8 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేమెంట్ గేట్‌వే సంస్థ సీఈఓ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలనే ఈ సంస్థను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కంపెనీ ఫుల్ అకౌంట్ నుంచి నిత్యం రూ. కోట్ల లావాదేవీలు కొనసాగుతాయి.
అయితే.. ఇటీవల ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ‘పేమెంట్ గేట్‌వే కంపెనీ’లో మార్చంటైల్‌గా సభ్యత్వం తీసుకున్నాడు. దీంతో అతనికి డబ్బులు జమ చేయడంతో పాటు ఇతరులకు బదిలీ చేసేందుకూ వెసులుబాటు ఉంటుంది. సైబర్ కలాపాలపై పూర్తి అవగాహనున్న అతను.. కంపెనీ ఖాతాను అతడు హ్యాక్ చేశాడు. సోమవారం రాత్రి సర్వర్ సమస్యలు సృష్టించి.. తనకున్న రూ.20 లక్షల పరిమితి దాటి అదనంగా రూ.2 లక్షలు డ్రా చేశాడు. అతని ప్రయత్నం ఫలించడంతో.. అరగంట వ్యవధిలోనే మరో ఏడు ఖాతాలకు మొత్తం రూ.1.25 కోట్లు బదిలీ చేసుకున్నాడు. డబ్బులు బదిలీ అయినట్లు సంస్థ యాజమాన్యానికి అలర్ట్ మెసేజ్ రావడంతో.. ఖాతాను పరిశీలించగా.. భారీగా నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. దీనిపై పేమెంట్ గేట్‌వే సంస్థ సీఈవో ప్రభుకుమార్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ సైబర్‌క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశాకు చెందిన వ్యక్తే.. ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: