ఆక్సీమీటర్ డౌన్‌లోడ్‌ చేసుకుంటే అకౌంట్‌ ఖాళీ ?

|

Jul 29, 2020 | 7:40 PM

సైబ‌ర్ నేర‌గాళ్లు స‌రికొత్త దందాకు తెర‌తీశారు. ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో మోసాల‌కు పాల్ప‌డుతున్నారు....

ఆక్సీమీటర్ డౌన్‌లోడ్‌ చేసుకుంటే అకౌంట్‌ ఖాళీ ?
Follow us on

సైబ‌ర్ నేర‌గాళ్లు స‌రికొత్త దందాకు తెర‌తీశారు. ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. క‌రోనా ప‌రిస్థితుల‌ను కూడా కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ప‌ల్స్ ఆక్సీమీటర్‌ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు.

శరీరంలో ఆక్సిజన్‌ స్థాయితో కరోనా ప్రభావాన్ని గుర్తించే వీలుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఆక్సీమీటర్లపై పడింది. మార్కెట్‌లో కంపెనీని బట్టి గరిష్ఠంగా రూ.1,500 వరకు పల్స్‌ ఆక్సీమీటర్లు లభిస్తున్నాయి. వీటిని కొనలేని వారు సెల్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఆక్సీమీటర్‌ తరహాలోనే శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చంటూ కేటుగాళ్లు గాలం వేస్తున్నారు. పొరపాటున యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తే మొబైల్‌ ఫోన్‌లో ఉన్న మొత్తం సమాచారం తస్కరించడంతోపాటు బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఆక్సీమీటర్‌ పేరుతో వచ్చే యాప్‌లు పూర్తి అబద్ధమని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసే సమయంలో కెమెరా ముందు చూపుడు వేలు ఉంచాలని తద్వారా శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిని తెలుసుకునేందుకు వీలుంటుందని సైబర్‌ నేరగాళ్లు సూచిస్తారని.. అలా చేయడం వల్ల వేలి ము ద్ర స్కాన్‌ చేసి మోసాలకు పాల్పడొచ్చని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

read more: https://tv9telugu.com/ts-covid-testing-mobile-vehicle-285377.html