అందుబాటులోకి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌, ఫ్రీగా చికిత్సః మంత్రి ఈట‌ల‌

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతోంది. స‌ర్కార్ తాజాగా మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది....

అందుబాటులోకి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌, ఫ్రీగా చికిత్సః మంత్రి ఈట‌ల‌
Follow us

|

Updated on: Jul 29, 2020 | 7:39 PM

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇప్పటికే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల సంఖ్య‌ను పెంచిన స‌ర్కార్ తాజాగా మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది. హైద‌రాబాద్‌లోని కోటి క‌మాండ్ కంట్రోల్ రూమ్‌లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌ను తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్రారంభించారు. అనంత‌రం కోవిడ్ టెస్టులు చేసే సంచార వాహ‌నాన్ని మంత్రి ప‌రిశీలించారు. మొబైల్‌ ల్యాబ్‌లో ఒకేసారి 10 మంది నుంచి నమూనాలు తీసుకునే అవకాశం ఉంది. ఒక్కో బస్సుకున్న పది కౌంటర్ల ద్వారా పరీక్షలు చేయవచ్చు.

ఈ సంద‌ర్బంగా మంత్రి ఈట‌ల మాట్లాడుతూ..1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 5 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్, నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ అవసరమవుతోందని చెప్పారు. కరోనా లక్షణాలు లేనివారికి ఇంట్లోనే ఐసోలేషన్‌ ఉంటుందని చెప్పారు. హోం ఐసోలేష‌న్‌ సౌకర్యం లేకపోతే ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స అందిస్తామన్నారు. పది రోజులపాటు మందులు, మాస్కులు అందిస్తామని వెల్లడించారు.

క‌రోనా బారిన‌ప‌డ్డ బాధితుల‌కు రూ.1 కూడా ఖర్చు లేకుండా 81శాతం మందికి ఉచితంగా కరోనా చికిత్స చేస్తున్నామని తెలిపారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ నిరంతరం జరుగుతునే ఉన్నాయని చెప్పారు. కరోనా విస్తరించకుండా ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఈటల వెల్లడించారు. హితం యాప్‌ ద్వారా కొవిడ్‌ రోగుల వివరాలను నమోదు చేస్తామని చెప్పారు.

read more: https://tv9telugu.com/ts-govt-rules-on-govt-hospitals-285263.html

https://tv9telugu.com/another-1764-coronavirus-cases-reported-in-telangana-death-toll-rise-to-492-284963.html