AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు..

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షుల విచారణను సిబిఐ ప్రారంభించింది. ఇవాళ సీబీఐ ముందు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. ఈయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడు..

సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు..
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2020 | 5:27 PM

Share

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షుల విచారణను సిబిఐ ప్రారంభించింది..కొన్నిరోజులుగా సీబీఐ అధికారులు పులివెందులలో ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే నిన్న (మంగళవారం) సీబీఐ విచారణకు వివేకా కుమార్తె సునీత హాజరయ్యారు. కాగా, (బుధవారం)ఇవాళ సీబీఐ ముందు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. ఈయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు.

గత 12 రోజులుగా పులివెందుల, కడప వేదికగా సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏడు గంటల పాటు, వైఎస్ సునీత రెడ్డిని సీబీఐ విచారణ చేసింది. ఆమె నుంచి చాలా వివరాలు రాబట్టినట్టు సమాచారం. అంతకు ముందు రెండు రోజుల పాటు వైఎస్ వివేక, ఇంటికి వాచ్ మెన్ గా ఉన్న వ్యక్తిని కూడా సీబీఐ విచారించింది. కాగా,  వివేకా కుమార్తె సునీత ఈ కేసులో హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్ రెడ్డి పేరు కూడా ఉన్నట్లు సమాచారం. హత్య జరిగిన రోజున ఘటనా స్థలిలో వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు శంకర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, ఆయన సాక్ష్యాలు తారుమారు చేయడానికి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో శివశంకర్ రెడ్డిని కూడా 5 రోజుల పాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థ అధికారులు విచారించారు. కానీ, సిట్ అధికారులు ఈ కేసును ఛేదించలేకపోయారు.

ఈ క్రమంలోనే..ఈ ప్రభుత్వం చేసే విచారణ పై తమకు నమ్మకం లేదు, ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. ఏకంగా వైఎస్ జగన్ సోదరి, వైఎస్ సునీత హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.. అనుమానితులుగా, వైఎస్ కుటుంబంలో కొంత మందిని చేర్చి, హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. తరువాత హైకోర్టు విచారణ జరిపి, ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తూ..నిర్ణయం తీసుకుంది.

Follow Us
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
వారానికి ఒక్కసారైనా తినండి.. చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
వారానికి ఒక్కసారైనా తినండి.. చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా