అన్న మిగిల్చిన విషాదం.. చెల్లికి ఇంకెవరు సాయం.!

|

Aug 28, 2019 | 2:27 PM

రాహుల్.. వయసు 26 సంవత్సరాలు. అందమైన కుటుంబం.. అందులోనూ తననే ఎంతో ఇష్టపడే చెల్లి ప్రియాంకా. జీవితమంతా సాఫీగా సాగుతోంది. కానీ ఇక్కడే రాహుల్ గురించి ఎవరికి తెలియని ఓ నిజం ఉంది. అతను ఓ ‘గే’. ఎప్పటి నుంచో  తన ఫ్రెండ్‌తో గడుపుతూ ఉంటాడు. అయితే సడన్‌గా ఆ ఫ్రెండ్ రాహుల్‌కి చెప్పకుండా అమెరికా ప్రయాణం అవుతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ ఒంటరితనాన్ని భరించలేక.. ఫేస్‌బుక్ ద్వారా ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. […]

అన్న మిగిల్చిన విషాదం.. చెల్లికి ఇంకెవరు సాయం.!
Follow us on

రాహుల్.. వయసు 26 సంవత్సరాలు. అందమైన కుటుంబం.. అందులోనూ తననే ఎంతో ఇష్టపడే చెల్లి ప్రియాంకా. జీవితమంతా సాఫీగా సాగుతోంది. కానీ ఇక్కడే రాహుల్ గురించి ఎవరికి తెలియని ఓ నిజం ఉంది. అతను ఓ ‘గే’. ఎప్పటి నుంచో  తన ఫ్రెండ్‌తో గడుపుతూ ఉంటాడు. అయితే సడన్‌గా ఆ ఫ్రెండ్ రాహుల్‌కి చెప్పకుండా అమెరికా ప్రయాణం అవుతాడు.

అతను వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ ఒంటరితనాన్ని భరించలేక.. ఫేస్‌బుక్ ద్వారా ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. దానికి తన చెల్లి ఫోటో పెట్టి రోనాల్డ్ అనే అబ్బాయితో పరిచయం పెంచుకుంటాడు. అన్న స్థానంలో ఉన్నానన్న సంగతి మర్చిపోయి తన చెల్లి వీడియోను కూడా అతనికి పంపిస్తాడు. అంతా సాఫీగానే సాగుతోంది. అయితే రోనాల్డ్ ఇదంతా నిజం అనుకుని ప్రియాంకను ప్రేమిస్తాడు. రాహుల్ పంపిన ఫోటోలు, వీడియోలు కల్పితాలు కాకపోవడంతో.. నిజాలను వెతుక్కుంటూ రోనాల్డ్ వెళ్తాడు. సర్‌ప్రైజ్ ఇస్తూ ప్రియాంకను ఆశ్చర్యపరుస్తాడు. కానీ ప్రియాంక మాత్రం కోపగించుకుని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది.

పోలీసులు రంగంలోకి దిగితే నిజం బయటికి వచ్చేస్తుంది. అలాగే చేసిందంతా రాహుల్ అని తెలిసిపోతుంది. దానితో అతడిని ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు వాళ్ళ నాన్న. ఎక్కడికి వెళ్లాలో.. ఎవరికి తన బాధను చెప్పుకోవాలో తెలియదు. కానీ తనను ప్రేమించే చెల్లెలికి మాత్రం క్షమాపణ ఉత్తరాన్ని పంపిస్తాడు.

రోజులు గడుస్తుండటంతో ప్రియాంక.. రోనాల్డ్ సహాయం తీసుకుని అన్నయ్యను వెతికే పనిలో పడుతుంది. ఇంతకీ రాహుల్ బ్రతికే ఉన్నాడా. అసలు ఏమైయ్యాడు అనేది మీరే చూడండి.