Cheating: ఓటీపీతో రూ.2.79 లక్షలు ఫట్‌.. సైబర్‌ నేరగాళ్ల చేతిలో నిలువునా మోసపోయిన వ్యాపారి..

|

Feb 06, 2022 | 9:24 AM

సైబర్‌ నేరాల (Cyber Crimes) పై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అవగాహన కల్పిస్తున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు. కొందరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సైబర్‌ మోసగాళ్లు అదే పనిగా నేరాలకు పాల్పడుతున్నారు

Cheating: ఓటీపీతో రూ.2.79 లక్షలు ఫట్‌.. సైబర్‌ నేరగాళ్ల చేతిలో నిలువునా మోసపోయిన వ్యాపారి..
Cyber Crime
Follow us on

సైబర్‌ నేరాల (Cyber Crimes) పై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అవగాహన కల్పిస్తున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు. కొందరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సైబర్‌ మోసగాళ్లు అదే పనిగా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా (Kamareddy) కు చెందిన ఓ వ్యాపారి కూడా సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి నిలువునా మోసపోయాడు. ఏకంగా రూ.2.79 లక్షలను పోగొట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డు కు చెందిన జొన్నల ప్రసాద్ అనే వ్యాపారి తన కొత్త ఏటిఎం యాక్టివేషన్ (ATM Activation) కొరకు గూగుల్‌లో సెర్చ్‌ చేయగా 7381607483 నంబర్‌ కనిపించింది. వెంటనే దీనికి కాల్‌ చేశాడు. కాగా దీనినే ఆసరగా మల్చుకున్నారు సైబర్‌ కేటుగాళ్లు.

ఫోన్‌లో ఏటీఎం కార్డ్ యాక్టివేషన్ కోసం ఓటీపీ పంపాం అని మోసగాళ్లు చెప్పిన మాటలు విన్న బాధితుడు తనకు వచ్చిన ఓటీపీ నంబర్‌ను వారితో షేర్‌ చేసుకున్నాడు. దీంతో తన ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్‌లోని రూ.2.79 లక్షలు మాయమయ్యాయి. కాగా సైబర్‌ నేరగాళ్ల చేతిలో నిలువునా మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కామారెడ్డి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ప్రసాద్‌ ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యా్ప్తు ప్రారంభించారు.

Also Read:Eesha Rebba: ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్‌?.. ఈషా నేచురల్ ఫొటోపై యంగ్‌ హీరోయిన్‌ నాటీ కామెంట్‌..

Nayanthara: నయన్‌ను మిస్‌ అవుతున్నానంటోన్న విఘ్నేశ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ వైరల్‌..

Lata Mangeshkar: లతాజీ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆశా భోస్లే.. దీదీ ఆరోగ్య పరిస్థతిపై ఏం చెప్పారంటే..