Smuggling Airport: హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో భారీగా స్మగ్లింగ్‌.. బంగారం, విదేశీ కరెన్సీతో పాటు ఐఫోన్‌ల స్వాధీనం..

|

Nov 22, 2021 | 7:51 PM

Smuggling Airport: శంషాబాద్‌ ఇంటర్‌ నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ స్మగ్లింగ్‌కు అడ్డగా మారుతోంది. తరుచూ ఏదో ఒక ఘటన బయటపడుతూనే ఉంది. డ్రగ్స్‌ నుంచి మొదలు బంగారం వరకు స్మగ్లింగ్ చేస్తూ..

Smuggling Airport: హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో భారీగా స్మగ్లింగ్‌.. బంగారం, విదేశీ కరెన్సీతో పాటు ఐఫోన్‌ల స్వాధీనం..
Smuggling Airport
Follow us on

Smuggling Airport: శంషాబాద్‌ ఇంటర్‌ నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ స్మగ్లింగ్‌కు అడ్డగా మారుతోంది. తరుచూ ఏదో ఒక ఘటన బయటపడుతూనే ఉంది. డ్రగ్స్‌ నుంచి మొదలు బంగారం వరకు స్మగ్లింగ్ చేస్తూ పలువురు అధికారులకు చిక్కుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజీవ్‌ గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో పలు కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మహిళల నుంచి రూ. 11.49 లక్షల విలువైన యూఏఈ కరెన్సీ, యుఎస్‌ డార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన మరో మహిళ దగ్గర రూ. 17.69 లక్షలు విలువ చేసే బంగారం బిస్కెట్లను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఐఫోన్‌లు స్వాధీనం..

ఇదిలా ఉంటే మరో కేసులో అక్రమంగా తరలిస్తున్న ఐఫోన్‌లు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం షార్జా నుంచి జీ9-458 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 9 ఐఫోన్‌ 13 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 8.37 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి విచారణ ప్రారంభించారు.

Also Read: Airtel vs Jio: ఇప్పుడు ఎయిర్‌టెల్‌ ప్రీ పెయిడ్ ప్యాక్.. జియో ప్యాక్ కంటే ఎంత ఎక్కువ ఖరీదో తెలుసా?

Mariamma Case: మరియమ్మ లాక్ అప్ డెత్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం.. సీబీఐకి అప్పగించే అంశంపై ఎమన్నారంటే..?

EPFO గుడ్‌ న్యూస్‌..18.34 కోట్ల ఖాతాదారులకు 8.50 శాతం వడ్డీ చొప్పున వడ్డీ జమ.. ఇలా చెక్ చేసుకోండి..