Accident in Prakasam district: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర సంఘటన జిల్లాలోని మద్దిపాడు మండలం సీతారామపురం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారామపురం వద్ద వేగంగా వస్తున్న కారు లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం స్థానికుల నుంచి పలు వివరాలను సేకరించారు.
ఈ ఘటనలో మృతిచెందిన వారిని సుధాకర్ (51), పద్మ (45)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కారు వేగంగా ఉండటం వల్లనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.
మృతులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: