Road Accident: వనస్థలిపురంలో బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్.. దంపతుల దుర్మరణం..

Couple died: హైదరాబాద్ న‌గ‌ర శివారులోని వ‌న‌స్థ‌లిపురంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప‌నామా చౌర‌స్తాలో ఓ బైక్‌ను టిప్ప‌ర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్తున్న

Road Accident: వనస్థలిపురంలో బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్.. దంపతుల దుర్మరణం..
Road Accident

Updated on: Jun 01, 2021 | 2:41 PM

Couple died: హైదరాబాద్ న‌గ‌ర శివారులోని వ‌న‌స్థ‌లిపురంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప‌నామా చౌర‌స్తాలో ఓ బైక్‌ను టిప్ప‌ర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్తున్న దంప‌తులిద్దరూ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్రవాహనంపై ఎల్బీనగర్ వైపు నుంచి హయత్‌నగర్ వెళుతున్న దంపతులను వెనుక నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరూ రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

ఈ ప్ర‌మాదంతో జాతీయ ర‌హ‌దారిపై భారీగా వాహ‌నాలు నిలిచిపోయాయి. ప్రమాదానికి గురైన వాహ‌నాల‌ను రోడ్డుపైనుంచి ప‌క్క‌కు త‌ర‌లించిన అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Ajith Bomb Threat: హీరో అజిత్ ఇంట్లో బాంబు.. స‌మాచారం అందుకున్న పోలీసులు త‌నిఖీలు చేయగా..

Vaindam Prashanth : పాకిస్తాన్ చెర నుంచి నాలుగేళ్ల తర్వాత ఆంధ్రాకు..! లవర్ కోసం వెళ్లి చిక్కుల్లో పడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్