Nellore: దంపతుల దారుణ హత్య.. కర్రతో కొట్టి, కత్తితో గొంతు కోసి.. కారణం తెలిస్తే షాక్..

|

Aug 28, 2022 | 2:57 PM

నెల్లూరులో (Nellore) దారుణం జరిగింది. దొంగతనం కోసం ఓ ఇంటికి వెళ్లిన దుండగులు.. డబ్బులు నగలు ఇవ్వాలంటూ మహిళను కర్రతో కొట్టి చంపేశారు. నగలు, డబ్బు కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో నిరుత్సాహంగా...

Nellore: దంపతుల దారుణ హత్య.. కర్రతో కొట్టి, కత్తితో గొంతు కోసి.. కారణం తెలిస్తే షాక్..
Crime News
Follow us on

నెల్లూరులో (Nellore) దారుణం జరిగింది. దొంగతనం కోసం ఓ ఇంటికి వెళ్లిన దుండగులు.. డబ్బులు నగలు ఇవ్వాలంటూ మహిళను కర్రతో కొట్టి చంపేశారు. నగలు, డబ్బు కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో నిరుత్సాహంగా వెనుతిరిగారు. అదే సమయంలో ఇంటికి వస్తున్న యజమానిని అడ్డుకున్నారు. దారుణంగా గొంతు కోసి ఆయన్నూ చంపేశారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది. నెల్లూరు నగరంలోని అశోక్‌నగర్‌లో కృష్ణారావు, సునీత దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఉద్యోగం, పెళ్లిళ్లు కావడంతో వీరి నుంచి వేరుగా ఉంటున్నారు. కృష్ణారావు స్థానికంగా క్యాటరింగ్ తో పాటు హోటల్‌ నిర్వహిస్తున్నాడు. హోటల్ కావడంతో అర్ధరాత్రి వరకు పనులు జరుగుతుండేవి. దీంతో కృష్ణారావు రాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి సునీత.. తన భర్త ఇంటికి వస్తారని తలుపులకు తాళం వేయలేదు. తన గదిలోకి వెళ్లి నిద్రపోయారు. అప్పటికే ముందస్తు ప్లాన్ ప్రకారం దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్ రూమ్ లో నిద్రపోతున్న సునీత తలపై కర్రతో గట్టిగా కొట్టారు. దీంతో ఆమె చనిపోయింది. దుండగులు బంగారు నగలు, డబ్బు కోసం వెతికారు. అయినా వారికి బీరువాలో అవి దొరకలేదు. దీంతో వెనుకకు మళ్లారు.

ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా వారికి కృష్ణారావు ఎదురయ్యారు. వారిని చూసిన కృష్ణారావు కేకలు వేశాడు. దీంతో తీవ్ర కోపంతో దుండగులు తమ వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసేశారు. ఈ ఘటనతో ఆయన కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఆదివారం ఉదయం వీరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించారు. దోపిడీ ఎలా జరిగింది? హత్య ఎలా చేశారనే వివరాలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి