Chittoor Crime: దారుణ ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సొంత పిల్లలపై, భార్యపై దాడులు ఇలా రకరకాల ఘటనలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూనే ఉంటాము. ఇక తాజాగా చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలంలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై భర్త కత్తితో కిరాతకంగా దాడికి తెగబడ్డాడు. భార్య లీల ప్రవర్తనపై అనుమానంతో భర్త సోకయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెదురు కుప్పం మండలం ఆళ్లమడుగు ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముదికుప్పంకు చెందిన లీల (23)ను 6 ఏళ్ల క్రితం ఆళ్ల మడుగు ఎస్సీ కాలనీకి చెందిన ఏళ్ల సోకయ్య (30) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మరో యువకుడితో వివాహేతర సంబంధం కలిగి ఉందని ఈ మధ్య కాలంలో భర్త పెద్దలతో పంచాయతీ పెట్టాడు.
అయినా భార్య ప్రవర్తన మారక పోవడంతో ఈ రోజు భర్త భార్య లీలతో గొడవపడి ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే కాణిపాకం ఆలయంలో సత్యప్రమాణం చేసేందుకు రావాలని భార్యతో భర్త గొడవ పడ్డట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య గొడవ పెద్దదికావడంతో పక్కనే ఉన్న కత్తితో లీలపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు సోకయ్య. ఈ దాడిలో భార్య మెడ, చెయ్యి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే దాడిని అపేందుకు అడ్డు వచ్చిన 4 ఏళ్ల కొడుకు అవినాష్‌పై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో అతని చెయికి తీవ్ర గాయాలై రక్తస్రావం అయ్యిందని పోలీసులు వివరించారు.
ఇక కొన ఊపిరితో ఉన్న లీలను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతు ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భర్త సోకయ్య పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. లీల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి