Child Marriage: తండాలో బాల్య వివాహం.. పోలీసుల కళ్లుగప్పి వధూవరుల జంప్.. చివర్లో దిమ్మ తిరిగే ట్విస్ట్

వయసు రాకుండా పెండ్లిళ్లు చేయడం నేరం. ఆడోళ్లకు 18 ఏండ్లు, మొగొళ్లకు 21 ఏండ్లు నిండినంకనే బాసింగం కట్టాలే. లేదని పెండ్లిళ్లు జరిపిస్తే పెండ్లి పిల్ల, పిలగానితో పాటు చుట్టాలు..

Child Marriage: తండాలో బాల్య వివాహం.. పోలీసుల కళ్లుగప్పి వధూవరుల జంప్.. చివర్లో దిమ్మ తిరిగే ట్విస్ట్
Child Marriage

Updated on: Jun 29, 2021 | 6:04 PM

వయసు రాకుండా పెండ్లిళ్లు చేయడం నేరం. ఆడోళ్లకు 18 ఏండ్లు, మొగొళ్లకు 21 ఏండ్లు నిండినంకనే బాసింగం కట్టాలే. లేదని పెండ్లిళ్లు జరిపిస్తే పెండ్లి పిల్ల, పిలగానితో పాటు చుట్టాలు పక్కాలందరికీ తిప్పలు తప్పవు. ఇది పోలీసులు చెప్పే హెచ్చరికలు. అయినా రోజుకు ఎక్కడో ఓ చోట పిల్లలకు పెండ్లిల్లు జరుపుతున్నారు. అటెనుక పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కి తిప్పలువడుతున్నారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం సోమారపుకుంట తండాలో చిన్న పిల్లలకు పెండ్లి చేయడం కలకలం  రేపింది. వయసు రాకుండానే పెండ్లి చేస్తున్నారని పోలీసులకు, చైల్డ్‌లైన్‌ సభ్యులకు మత్‌లావ్‌ పంపారు. అయితే వారు ఊరికి చేరుకునేలోపే పెండ్లి ముచ్చట జరిగిపోయింది.

పెండ్లి పిలగానికి, పిల్లకు అధికారులు కౌన్సెలింగ్ ఇస్తుండగా తండావాసులు అడ్డు తగిలారు. చైల్డ్ లైన్ అధికారులు, పోలీస్ లను ఊరోళ్లు అడ్డుకోవడంతో పెండ్లి పిల్ల, పిలగాడు బానోత్ స్వాతి, గూగులోతు సురేష్ పరార్‌ అయ్యారు. అప్పటికే స్వాతి , సురేశ్‌లు ప్రేమించుకుని ఇంటి నుంచి పరార్ అయ్యేందుకు ప్రయత్నించారు.

పెండ్లి పిలగాని చుట్టాలు, పెండ్లి పిల్ల బంధవులు అందరూ కలిసే ఆలోచించి పెండ్లి జరిపించామని చెబుతున్నారు. ఇందులో ఎవరి బలవంతం లేదన్నారు. అయితే పెండ్లి వయసు రాని మైనర్ బాలికకు వివాహం చేయడం నేరమని చెప్పడంతో వధువు తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. వివాహం అడ్డుకోవద్దని కోరింది. చేసేదేమీ లేక చైల్డ్ లైన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వచ్చేలోపే పెండ్లి తంతు కానిచ్చారు కుటుంబ బంధువులు.

ఇవి కూడా చదవండి:  Darbhanga Blast: దర్బంగా పేలుళ్ల వెనుక హైదరాబాదీలు.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి NIA

Viral Video: చిన్నారిని నవ్వించేందుకు కుక్క కుప్పిగంతలు.. ఈ వీడియో చూస్తే.. అస్సలు నవ్వాపుకోలేరు..