AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంగడి సరుకుగా చిన్నారి.. చేరదీసిన అధికారులు

అక్రమంగా పసిపాపను పెంచుకుంటానని తెచ్చుకున్న చిన్నారికి నరకం చూపింది. కనీసం అలనాపాలన కూడా కరువైంది. 17 రోజులకే ఆ పాప నిరాదరణకు గురైంది. ఇరుపొరుగు వారి సమాచారం మేరకు అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

అంగడి సరుకుగా చిన్నారి.. చేరదీసిన అధికారులు
Balaraju Goud
|

Updated on: Sep 21, 2020 | 3:46 PM

Share

అక్రమంగా పసిపాపను పెంచుకుంటానని తెచ్చుకున్న చిన్నారికి నరకం చూపింది. కనీసం అలనాపాలన కూడా కరువైంది. 17 రోజులకే ఆ పాప నిరాదరణకు గురైంది. ఇరుపొరుగు వారి సమాచారం మేరకు అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన చిన్నారిని పెంచుకుంటానని తెచ్చుకుంది. గుంటూరు పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన రాజ్యలక్ష్మి తెలిసినవారి ద్వారా 17 రోజుల పసిపాపను తెచ్చి పెంచుతుంది. కొత్త డబ్బులు ముట్టజెప్పి చిన్నారిని తీసుకువచ్చింది. కానీ, ఆ పాప ఆరోగ్యంపై సరిగా శ్రద్ధ చూపించడం లేదు. దీంతో పాప జబ్బు పడింది. ఇది గమనించిన ఇరుగుపొరుగువారు చైల్డ్‌లైన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్‌ జిల్లా అధికారులు తమ సిబ్బందితో అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. వినుకొండ సమీపంలోని తండా నుంచి ఎటువంటి దత్తత పత్రాలు లేకుండా అక్రమ పద్ధతిలో ఆ పాపను తీసుకు వచ్చినట్లు గుర్తించారు. ఆ పసికందును స్వాధీనం చేసుకొని బాలల సంరక్షణ కేంద్రం అధికారులకు అప్పగించారు. రాజ్యలక్ష్మిపై పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us