Encounter: దండకారణ్యంలో ఎదురు కాల్పులు.. మావోయిస్టు హతం.. కొనసాగుతున్న కూంబింగ్

|

Jul 25, 2021 | 12:35 PM

Naxal Encounter: ఛ‌త్తీస్‌గఢ్ దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఆదివారం

Encounter: దండకారణ్యంలో ఎదురు కాల్పులు.. మావోయిస్టు హతం.. కొనసాగుతున్న కూంబింగ్
Encounter
Follow us on

Naxal Encounter: ఛ‌త్తీస్‌గఢ్ దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతాగుఫా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కు చెందిన రెండు బెటాలియన్లు, డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తాసరపడి కాల్పులు ప్రారంభించినట్లు భద్రతా అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారని.. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ సునీల్ శర్మ పేర్కొన్నారు.

మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక బర్మార్ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. కాగా.. మావోయిస్టుల వారోత్సవాల దృష్ట్యా పోలీస్ బలగాలు అడవుల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి కూంబింగ్ ఆపరేషన్ ను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

Also Read:

Drunk and Drive: పోలీసుల వినూత్న ప్రయత్నం.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారో ఇకపై ‘రంగు’ పడుద్ది..

Hyderabad Crime: హైదరాబాద్‌లో గర్భిణి కిడ్నాప్.. మెడపై కత్తి పెట్టి, మత్తుమందు సాయంతో అపహరణ.. అసలు కారణం వేరే ఉందంటూ..

Cyber Crime: ఇంతకంటే దారుణం మరోటుండదు.. తల్లి కోసం దాచిన డబ్బు.. ఒక్క ఫోన్ కాల్‌తో..