CRPF: రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు జవాన్లకు తీవ్ర గాయాలు.. రైలులో..

|

Oct 16, 2021 | 11:38 AM

CRPF jawans injured: ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌ రైల్వేస్టేష‌న్‌లో శ‌నివారం ఉద‌యం భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు

CRPF: రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు జవాన్లకు తీవ్ర గాయాలు.. రైలులో..
Raipur Railway Station
Follow us on

CRPF jawans injured: ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌ రైల్వేస్టేష‌న్‌లో శ‌నివారం ఉద‌యం భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ఘ‌ట‌న‌లో ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాల‌య్యాయి. సీఆర్‌పీఎఫ్‌ స్పెషల్‌ ట్రైన్‌లో ఇగ్నిటర్‌సెట్‌ ఉన్న బాక్స్‌ కిందపడి పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఆరుగురు సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) సిబ్బంది తీవ్రంగా గాయడ్డారని.. వారిని రాయ్‌పూర్‌లోని నారాయణ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఉదయం 6.30 సమయంలో జార్సుగూడ నుంచి జమ్మూతావి వెళ్తున్న రైలు ప్లాట్‌ఫామ్‌ మీద ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.


Also Read:

Crime News: మూడు రోజుల పసికందు అపహరణ.. గుంటూరులో కలకలం.. నిద్రిస్తుండగా అర్థరాత్రి..

Durga idol immersion: నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. నమజ్జనం చేస్తుండగా ప్రమాదం.. ఐదుగురు యువకుల మృతి..

Crime News: జ‌గిత్యాల జిల్లాలో దారుణం.. రౌడీషీట‌ర్ హత్య.. కత్తులతో నరికి..