Chain Snatcher: ప్రశ్నార్థకంగా మారుతోన్న మానవత్వం.. కనీసం గర్భవతి అని కూడా చూడకుండా.. ఈడ్చుకెళ్లిన దుండగులు..

|

Apr 13, 2021 | 7:42 PM

Chain Snatcher: రచయిత, గాయకుడు అందె శ్రీ చెప్పినట్లు మానవత్వం ఉన్న వ్యక్తిని భూతద్దం వేసి వెతినికా కనబడడం లేడు. సమాజంలో మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతోంది. డబ్బే పరమావధిగా మారిపోయిన రోజుల్లో మనుషులకు, వారి ప్రాణాలకు...

Chain Snatcher: ప్రశ్నార్థకంగా మారుతోన్న మానవత్వం.. కనీసం గర్భవతి అని కూడా చూడకుండా.. ఈడ్చుకెళ్లిన దుండగులు..
Chain Snatchers
Follow us on

Chain Snatcher: రచయిత, గాయకుడు అందెశ్రీ చెప్పినట్లు మానవత్వం ఉన్న వ్యక్తిని భూతద్దం వేసి వెతినికా కనబడడం లేడు. సమాజంలో మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతోంది. డబ్బే పరమావధిగా మారిపోయిన రోజుల్లో మనుషులకు, వారి ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. తాజాగా చెన్నైలో జరిగిన ఓ సంఘటన చూస్తుంటే ఈ మాటలు అక్షర సత్యాలుగా అనిపిస్తున్నాయి. నిండు గర్భవతి అని కూడా చూడకుండా ఓ మహిళలపై ఇద్దరు వ్యక్తులు చేసిన దాడి అత్యంత పాశవికంగా ఉంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన అందరినీ కలచి వేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాజధాని చైన్నైలోని పల్వరంలోని రేణుకానగర్‌లో గీత (25) అనే ఓ మహిళ గుడి నిల్చుని దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఆమె ఎనిమిది నెలల గర్భవతి. అయితే ఆమె దేవుడికి దండం పెట్టుకుంటున్న సమయంలోనే అక్కడికి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆగారు. ఆ ఇద్దరిలో ఒకరు బైక్‌ దిగి గీతను సమీపించాడు. ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో గీత ప్రతిఘటించింది.. కానీ ఎంతకు తగ్గని ఆ దుర్మార్గుడు గీతను నెట్టేశాడు. దీంతో రోడ్డుపై పడ్డ గీత మెడలోని చైన్‌ను లాగుతూ కొంచెం దూరం ఈడ్చుకెళ్లాడు. చివరికి ఆ గోలుసును లాక్కొని పారిపోయాడు. కనీసం గర్భవతి అని కూడా చూడకుండా దిగిన దుశ్చర్యకు సంబంధించిన సన్నివేశాలు అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారు వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే గీత భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Chain Snatching

Also Read: Massive Fire at Mall: షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. లాక్‌డౌన్ కారణంగా తప్పిన పెను ముప్పు

Kidnap Case: స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసిన పీటీ సార్.. ఆపై పెళ్లి చేసుకునేందుకు ప్లాన్.. చివరకు ఏమైందంటే..?

Oxygen Shortage: కరోనా మరణ మృదంగం.. ఆక్సిజన్ కొరతతో ఏడుగురు రోగుల మృతి.. బంధువుల ఆందోళన