Chaddi Gang: తిరుపతిలో మరోసారి చడ్డీ గ్యాంగ్‌ హల్చల్.. భయంతో వణికిపోతున్న ప్రజలు..

Chaddi Gang: చడ్డీ గ్యాంగ్ ఈ పేరు వింటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది. ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఈ ముఠా సభ్యులు దొంగతనాలకు తెగబడుతున్నారు. నగరాలకు దూరంగా తాళాలు వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌...

Chaddi Gang: తిరుపతిలో మరోసారి చడ్డీ గ్యాంగ్‌ హల్చల్.. భయంతో వణికిపోతున్న ప్రజలు..
Chaddi Gang

Updated on: Sep 08, 2022 | 6:50 AM

Chaddi Gang: చడ్డీ గ్యాంగ్ ఈ పేరు వింటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది. ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఈ ముఠా సభ్యులు దొంగతనాలకు తెగబడుతున్నారు. నగరాలకు దూరంగా తాళాలు వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌. దర్జాగా ఇంట్లోకి ప్రవేశించి దొరికినకాడికల్లా దోచుకుంటున్నారు. తాజాగా తిరుపతిలో చడ్డీ గ్యాంగ్‌ హల్చల్‌ చేసింది. సోమవారం రాత్రి . తిరుచానూరులో ఎమ్మార్‌పల్లిలో దొంగల సంచరాన్ని పోలీసులు గుర్తించారు.

ముగ్గురు దొంగలు ఓ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తీరు.. వాళ్ల కదలికల ఆధారంగా చెడ్డీగ్యాంగ్‌ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తిరుపతిలో దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో చెడ్డీ గ్యాంగ్‌ అలజడి మరింత భయపెడుతోంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు.. శివార్లలో మకాం వేసి బిచ్చగాళ్లలా, బొమ్మలు, దుప్పట్లు అమ్మేవాళ్లలా తిరుగుతున్నట్టు తెలుస్తోంది. తాళాలు వేసిన ఇళ్లపై పగలు రెక్కీ చేసి, రాత్రిళ్లు చోరీకి స్పాట్ పెడుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. బనియన్‌, చెడ్డీ వేసుకుని శరీరానికి నూనె పూసుకొని దోపిడీకి ప్రయత్నిస్తుంటారు.

తాజాగా . తిరుచానూరులో దొంగలు ప్రహారీ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన విజువల్స్ రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రాత్రివేళల్లో గస్తీని ముమ్మరం చేశారు. ముగ్గురు సభ్యుల ముఠా లోకల్‌గానే అడ్డా వేసిందా..? వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయిందా అన్న కోణంలో ఆరాతీస్తున్నారు. చెడ్డీగ్యాంగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే అపార్ట్‌మెంట్లు, ఇళ్ల దగ్గర ఉండే వాచ్‌మెన్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..