Nutan Naidu Cases: శిరోముండనం కేసులో అరెస్టైన్ నూతన్ నాయుడు మోసాలు బయటపడుతున్నాయి. పోలీస్ స్టేషన్‌లో నూతన్ నాయుడుపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. బ్యాంకులో ఉద్యోగాలిప్పిస్తానని పలువురికి టోకరా వేసిన నూతన్ నాయుడు.. వారి నుంచి భారీగా వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి ఎస్‌బీఐలో డైరెక్టర్ పదవి ఇప్పిస్తానని ట్రాప్ చేసిన నూతన్ నాయుడు.. అతడి నుంచి రూ.12కోట్లు వసూలు చేశాడు. అలాగే నూకరాజు అనే మరో వ్యక్తికి అదే బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని 5 లక్షలు వసూలు చేశాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరు మహారాణి పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నూతన్ నాయుడుపై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కాగా రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ పేరుతోనూ నూతన్ నాయుడు మోసాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో పలు పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే నూతన్ నాయుడుపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Read More:
కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 2,278 కొత్త కేసులు.. 10 మరణాలు
డ్రగ్స్ కేసు.. రకుల్ పేరు చెప్పిన రియా!