డ్రగ్స్ కేసు.. సారా పేరు చెప్పిన రియా!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన విషయం తెలిసిందే

డ్రగ్స్ కేసు.. సారా పేరు చెప్పిన రియా!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 17, 2020 | 5:49 PM

Bollywood drugs case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో దర్యాప్తు జరిపిన ఎన్సీబీ అధికారులు నటి రియా, ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిందా, వంటమనిషి దినేష్‌ సావంత్‌ సహా పలువురిని అరెస్ట్ చేశారు. వారందరినీ జైలుకు తరలించారు ఎన్సీబీ అధికారులు. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో భాగంగా రియా చక్రవర్తి పలువురి పేర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది.

సైఫ్‌ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్, హీరో రణ్‌వీర్ సింగ్ సన్నిహితురాలు సైమాన్ ఖంబట్టా తదితరుల పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే రియా కాంటాక్ట్‌లో టాలీవుడ్ ప్రముఖులు రానా పేర్లు ఆ మధ్యన బయటకు వచ్చాయి. కాగా సుశాంత్ కేసులో రియా పేరు మొదటి నుంచి వినిపిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ, ఈడీ, ఎన్సీబీ అధికారులు రియాను పలుమార్లు విచారించారు.

Read More:

అంబులెన్స్ ఛార్జీలపై సుప్రీం ఆదేశాలు

ఏపీలో ఈ నెల 20 నుంచి సిటీ బస్సు సర్వీసులు