హిమాచల్ ప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం.. చాంబా జిల్లా లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి, 13మందికి గాయాలు

|

Mar 10, 2021 | 12:40 PM

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం బస్సు లోయపడి ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

హిమాచల్ ప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం.. చాంబా జిల్లా లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి, 13మందికి గాయాలు
Follow us on

Chamba Road Accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం బస్సు లోయపడి ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. చాంబా జిల్లా మంగ్లీ నుంచి చాంబా వెళుతున్న ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు తీశా వద్ద అదుపుతప్పి ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలతో సహాయకచర్యలు చేపట్టారు.

గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుంటే చాంబా జిల్లాలో గత ఏడాది నవంబరులో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. చాంబా రోడ్డు మూలమలుపులో డ్రైవర్లు అదుపుతప్పి ప్రమాదాల పాలవుతున్నారు. గత ఏడాది మార్చి నెలలోనూ హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సు లోయలో పడి ఐదుగురు ప్రయాణికులు మరణించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న చాంబా రోడ్డును అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చాంబా జిల్లా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also…  ఒక్కసారి చెల్లిస్తే.. జీవితకాలం పెన్షన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రణాళిక.. ఎలానో తెలుసా..