‘ట్రిపుల్‌ తలాక్‌’ కేసు నమోదు..యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు

|

Jul 20, 2020 | 2:16 PM

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రిపుల్‌ తలాక్‌ కేసు నమోదైంది. ఫోన్‌లో భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడని బాధిత మహిళ ఒకరు ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్ని విచారిస్తున్నట్లుగా తెలిపారు. బాధితురాలు,..

‘ట్రిపుల్‌ తలాక్‌’ కేసు నమోదు..యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు
Follow us on

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రిపుల్‌ తలాక్‌ కేసు నమోదైంది. ఫోన్‌లో మూడు సార్లు‌ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడంటూ..బాధిత మహిళ ఒకరు ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్ని విచారిస్తున్నట్లుగా తెలిపారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ఎల్‌బీనగర్‌కు చెందిన హసినాకు అబ్దుల్‌ సమీ అనే యువకుడితో 2017లో వివాహం జరిగింది. సమీ స్థానికంగా ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా విధులు నిర్వహించేవాడు. పెళ్లైన కొన్నాళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, ఇటీవల కొన్ని నెలల నుంచి అత్తవారింటి నుంచి తనకు వేధింపులు ఎదురవుతున్నాయని, అదనపు కట్నం కోసం తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆ మహిళ ఆరోపించింది. తాను డబ్బు తీసుకు రాకపోవడంతో ఇటీవల ఫోన్‌ చేసి మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశానంటూ బెదిరిస్తున్నాడని  (ట్రిపుల్‌ తలాక్)‌ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మహిళా వివాహ హక్కుల రక్షణ చట్టం-2019 ప్రకారం అబ్దుల్‌ సమీపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.

 

Read More:

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా విజృంభణ… 800 దాటిన కేసులు

తమ్ముడికి కరోనా..భయంతో అన్న ఆత్మహత్య