Car Hit: తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. మద్యం మత్తులో పోలీసులను ఢీ కొట్టాడు.. కట్ చేస్తే..

పోలీసు సిబ్బందిని కారుతో ఢీకొట్టిన షాకింగ్ సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. పాటియాలాలో సెక్యూరిటీ చెక్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన...

Car Hit: తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. మద్యం మత్తులో పోలీసులను ఢీ కొట్టాడు.. కట్ చేస్తే..
Car Evading Security Check

Updated on: Aug 15, 2021 | 2:43 PM

పోలీసు సిబ్బందిని కారుతో ఢీకొట్టిన షాకింగ్ సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. పాటియాలాలో సెక్యూరిటీ చెక్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 15 ఆగస్టు సందర్భంగా పాటియాలలో పోలీసులు తఖీలు నిర్వహిస్తున్న అదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారును ఆపేందుకు ప్రయత్నించారు పోలీసులు. అయితే పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పాయింట్లను దాటుకుని నేరుగా పోలీసులను డ్రైవర్ ఢీకొట్టాడు. కారుపై నుంచి ఎగిరిపడిన పోలసుకు తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన పోలీసును చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతనికిి వైద్య చికిత్స అందిస్తున్నారు.. ఇప్పుడు అతని పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని పోలీస్ అధికారులు తెలిపారు. కారును పట్టుకునే పనిలో ఉన్నట్లుగా స్థానిక డీఎస్‌పీ తెలిపారు. “తనిఖీ నుండి తప్పించుకోవడానికి కారు డ్రైవర్ కారుతో పాటు పోలీసు సిబ్బందిని లాగారు. కారు కనుగొనబడింది మరియు తదుపరి దర్యాప్తు జరుగుతోంది “అని డిఎస్‌పి సిటీ హేమంత్ శర్మ చెప్పారు.

కారు నెంబర్ ఆదారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి: Barack Obama Video: ఒబామా‌ను ఇరుకున పెట్టిన వీడియో లీక్.. క్షమాపణ కోరిన అమెరికా సింగర్

IND vs ENG 2nd Test Day 3 Highlights: ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్.. 391 పరుగులకు ఆలౌట్..