సోద‌రి పేరుతో ఘ‌రానా మోసం…చెల్లించాడు భారీ మూల్యం

|

Jun 12, 2020 | 4:10 PM

సోష‌ల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు వ‌ల‌వేసి.. న్యూడ్ ఫోటోలతో బెదిరించి రూ.3.63 లక్షలు కొట్టేసింది అమ్మాయి కాదని హైదరాబాద్‌ పోలీసులు తేల్చారు. యువతి పేరుతో ఆమె సోదరుడే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా క్రియేట్ చేసి ఈ కుయుక్తులు ప‌న్నినట్టు నిర్దారించారు.

సోద‌రి పేరుతో ఘ‌రానా మోసం...చెల్లించాడు భారీ మూల్యం
Follow us on

సోష‌ల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు వ‌ల‌వేసి.. న్యూడ్ ఫోటోలతో బెదిరించి రూ.3.63 లక్షలు కొట్టేసింది అమ్మాయి కాదని హైదరాబాద్‌ పోలీసులు తేల్చారు. యువతి పేరుతో ఆమె సోదరుడే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా క్రియేట్ చేసి ఈ కుయుక్తులు ప‌న్నినట్టు నిర్దారించారు. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా వ‌ర్క్ చేస్తోన్న ఓ వ్య‌క్తికి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. మొద‌ట స్లోగా మొద‌లైన‌ చాటింగ్ ఆ త‌ర్వాత హ‌ద్దులు మీరి న్యూడ్ ఫోటోలు పంపుకునేవ‌ర‌కు వ‌చ్చింది. ఆ తర్వాతి నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కి వేధింపులు ప్రారంభ‌మయ్యాయి. రూ.30 లక్షలు ఇవ్వకుంటే న్యూడ్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెడ‌తానంటూ వార్నింగ్స్ వ‌చ్చాయి. దీంతో బ‌య‌ప‌డిన టెకీ వారం రోజుల్లో రూ.3.63 లక్షలు అకౌంట్లోకి బ‌దిలీ చేశాడు. ఇంకా డబ్బు కావాలని వేధింపులు రావ‌డంతో.. బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నాలజీ వినియోగించి ద‌ర్యాప్తు చేశారు. విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు వెలుగుచూశాయి. టెకీతో చాటింగ్‌ చేసింది అమ్మాయి కాదని, యువకుడని గుర్తించారు. మల్కాజిగిరిలో నివ‌శించే కె.పవన్‌కిరణ్‌ (20) నగరంలోని ఓ కళాశాల బీటెక్ ద్వితీయ సంవ‌త్స‌రం చదువుతున్నాడు. ఆన్‌లైన్ జూదం, ఇతర విలాసాలకు అలవాటుపడిన అతడు ఈజీగా మ‌నీ పొందాల‌నే ఉద్దేశంతో సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేయడానికి ప్లాన్ వేశాడు. ఓ అమ్మాయి పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఓపెన్ చేసి అందమైన ఫోటోలు పోస్ట్ చేశాడు.

ఆపై ప్లానింగ్ లో భాగంగా కాచిగూడకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అమ్మాయి నుంచి రిక్వెస్ట్ రావ‌డంతో అవ‌త‌‌లి వ్య‌క్తి వెంటనే యాక్సెప్ట్ చేశాడు. అక్క‌డ మొద‌లైన చాటింగ్ న్యూడ్ ఫోటోల వ‌ర‌కు వెళ్లింది. ఆపై వాటిని అడ్డం పెట్టుకుని రూ.30లక్షలు ఇవ్వకపోతే నీ న్యూడ్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో పరువు పోతుంద‌ని భ‌య‌ప‌డిన‌ బాధితుడు రూ.3.63లక్షలు అతడి అకౌంట్లోకి బ‌దిలీ చేశాడు. ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో పోలీసులను ఆశ్రయించగా అసలు నిజం వెలుగుచూసింది.