AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. అతనికి బాగా తాగించి ఏం చేశారంటే..?

శివమొగ్గ జిల్లాలో ఒక మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్న వ్యక్తిని ఆమె ఇద్దరు కొడుకులు హత్య చేశారు. వసంత్ అనే 35 ఏళ్ల వ్యక్తి, ఆదివారం రాత్రి మద్యం సేవించి ఆ మహిళ ఇంటి వద్ద గొడవ చేశాడు. దీనితో ఆగ్రహించిన ఆమె కొడుకులు ఆకాష్ మరియు హరీష్, వసంత్‌ను కత్తితో దాడి చేసి చంపారు.

తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. అతనికి బాగా తాగించి ఏం చేశారంటే..?
Vasanth (file)
SN Pasha
|

Updated on: Jun 30, 2025 | 9:43 PM

Share

తమ తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఆమె ఇద్దరు పిల్లలు దారుణంగా హత్య చేశారు. శివమొగ్గ తాలూకాలోని కుంభేశ్వర్ వీధిలో వాసు అలియాస్ వసంత్ (35) దారుణంగా హత్యకు గురయ్యారు. నిన్న (జూన్ 29) కుంభేశ్వర్ వీధి నుండి ఎకె కాలనీకి వెళ్లే వసంత్ ను ఆకాష్, హరీష్ అనే ఇద్దరు సోదరులు కత్తితో కొట్టి హత్య చేశారు. మృతుడు వసంత్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నిన్న మద్యం తాగి ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశారు. దీంతో ఆ మహిళ సవితి కుమారుడు హరీష్, సొంత కొడుకు ఆకాష్ కలిసి వసంత్ ను కొట్టి చంపారు.

నిందితుల తండ్రి మల్లెషప్పకు ఇద్దరు భార్యలు. మల్లెషప్ప, అతని మొదటి భార్య ఇద్దరూ చనిపోయారు. రెండో భార్య హత్యకు గురైన వసంత్‌తో వివాహేతర బంధం కలిగి ఉంది. ఆ మహిళ వయస్సులో తనకంటే పెద్దది అయినప్పటికీ వసంత్ ఆమెతో సంబంధం కొనసాగించాడు. అయితే ఆదివారం వసంత్‌ తాగి వచ్చి ఆ మహిళ ఇంటి ముందు కేకలు వేసి గొడవ చేశాడు. ఈ సంఘటన మొదటి భార్య కుమారుడు హరీష్, రెండవ భార్య కుమారుడు ఆకాష్ సోదరులను ఆగ్రహానికి గురిచేసింది. తల్లితో గొడవ పడిన వసంత్‌ను హత్య చేయడానికి వారు ఒక స్కెచ్ వేశారు. దానికి అనుగుణంగా వారు వసంత్‌కు ఫుల్లుగా మద్యం తాగించి నిన్న రాత్రి కుంసి పట్టణంలో దారుణంగా హత్య చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..