ప్రాణం తీసిన పతంగి

|

Sep 13, 2020 | 1:52 PM

హైదరాబాద్ మహానగరంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ తీగల్లో చిక్కుకున్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించిన బాలుడు విద్యుదాఘాతంతో ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన నేరేడ్‌మెట్‌ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

ప్రాణం తీసిన పతంగి
Follow us on

హైదరాబాద్ మహానగరంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ తీగల్లో చిక్కుకున్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించిన బాలుడు విద్యుదాఘాతంతో ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన నేరేడ్‌మెట్‌ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.. సాయినగర్‌ ప్రాంతానికి చెందిన కుమార్‌ కూలీ పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి కీర్తన్‌ (12) అనే కుమారుడు, ఓ కుమార్తె ఇద్దరు పిల్లలు. శనివారం కీర్తన్‌ ఎదురింటి భవనంపైకి వెళ్లి గాలిపటాన్ని ఎగురవేస్తున్నాడు. ఇదే క్రమంలో భవనంపై వేలాడుతున్నా విద్యుత్‌ తీగల మధ్యలో గాలిపటం చిక్కుకుంది. దీంతో గాలిపటాన్ని అందుకుని లాగే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు బాలుడికి తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే కుప్పకూలాడు. అతడిని గమనించిన స్థానికులు, తల్లిదండ్రులు బాలుడిని రక్షించేందుకు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, బాలుడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చుట్టుపక్కల వారిని కంటతడి పెట్టించాయి. గత కొన్నేళ్లుగా ఇళ్లపై వైర్లు వేడుతున్నా తీగలను తొలగించాలని ఎన్నిమార్లు విద్యుత్‌ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. బాలుడి తండ్రి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్న నేరేడ్‌మెట్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.