Black Magic: పెద్దాపురంలో క్షుద్రపూజలు కలకలం.. ఇంటి అవరణలో నిమ్మకాయలు, పూజాసామగ్రి..!

పెద్దాపురంలో క్షుద్రపూజలు కలకలం.. ఇంటి అవరణలో నిమ్మకాయలు, పూజాసామగ్రి..

Black Magic: పెద్దాపురంలో క్షుద్రపూజలు కలకలం.. ఇంటి అవరణలో నిమ్మకాయలు, పూజాసామగ్రి..!
Nalgonda Black Magic

Edited By: Balaraju Goud

Updated on: Jul 10, 2021 | 10:39 AM

Black Magic in Peddapuram: ప్రపంచం మొత్తం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంది. కొందరు ఇంకా మూఢనమ్మకాలతో పాతాళ లోకానికి చేరుతున్నారు. విద్యావంతులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ తాంత్రిక పూజల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అమాయకులను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. సత్తెమ్మకాలనీలో అర్ధరాత్రి ఓ ఇంటి ఆవరణలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. నిమ్మకాయలు, పూజాసామగ్రి ఇంటిముందు పడేశారు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో ఎవరికైనా చేతబడి చేశారా..? అసలేం జరిగింది..? అని ఆందోళన చెందుతున్నారు స్థానికులు.

స్థానిక పాత పెద్దాపురం సతెమ్మ కాలనీలో సాగర్ మునిసిపల్ హైస్కూల్ సమీపంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో తలలేని కోడి, నిమ్మకాయలు, అన్నం ముద్దలు,కత్తి ఉన్న సంచిని స్థానికులు గుర్తించారు. ఇంటి ఆవరణలో గుర్తు తెలియని దుండగులు పడేసి పోయారని అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దీనిపై ఇంటి యాజమాని పోలీసులకు ఫిర్యాద చేశారు. తమ కుటుంబానికి హాని తలపెట్టేందుకు ఇలా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read Also… Goat Detention: తప్పు చేసిందని మూగ జీవిని తాళ్లతో కట్టేసిన మున్సిపల్ సిబ్బంది.. అంత పెద్ద తప్పు ఏంచేసిందబ్బా..?