Black magic: క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. ఆదివారం వ‌చ్చిందంటే అక్క‌డ వ‌ణుకు

|

May 17, 2021 | 10:01 AM

ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు క్షుద్రపూజల కలకలం. వెరసి పెద్దపల్లి జిల్లా వాసులకు కంటిమీద కునుకు రావడం లేదు. సుల్తానాబాద్‌ శివారులో రోజూ...

Black magic: క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. ఆదివారం వ‌చ్చిందంటే అక్క‌డ వ‌ణుకు
Black Magic
Follow us on

ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు క్షుద్రపూజల కలకలం. వెరసి పెద్దపల్లి జిల్లా వాసులకు కంటిమీద కునుకు రావడం లేదు. సుల్తానాబాద్‌ శివారులో రోజూ ఏదో ఓచోట క్షుద్రపూజల కలకలం రేగుతోంది. దీంతో జనం వణికిపోతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు జనం బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. సుల్తానాబాద్ శివారులోని పంట పొలాల సమీపంలో తాజాగా క్షుద్రపూజలు వెలుగు చేశాయి. ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. తెల్లవారుజామున వాకింగ్ వచ్చే వాళ్లకు క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. నిమ్మకాయలు, ప్రాణం ఉన్న కోడిని వదిలిపెట్టారు. అంతేకాదు ఒక నల్లగుడ్డలో నవధాన్యాలు ఉన్నాయి. ఆ పక్కనే చిన్న పిల్లవాడి బట్టలు కనిపించాయి. అటు వైపు నుండి వెళ్లాలంటేనే జనం భీతిల్లుతున్నారు

ఆదివారం రోజున వాకింగ్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అర్ధరాత్రి క్షుద్రపూజలు చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. గ్రామ శివారు ప్రాంతాల్లో వరుసగా క్షుద్రపూజలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలను భయబ్రాంతుల‌కు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: కేవలం 100 రూపాయ‌ల కోసం వ్య‌క్తిని కిరాత‌కంగా చంపిన దంప‌తులు.. అసలు ఏం జ‌రిగిందంటే..?

ఇది ప్రపంచంలోని విచిత్రమైన సరస్సు, దీని లోప‌ల అడ‌వి ఉంది.. వివ‌రాలు