ఎంపీటీసీ ఫలితాలు.. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారితీశాయి. మంగళవారం వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో డోకూరు గ్రామంలో బీజేపీ అభ్యర్థి యజ్ఞం భూపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా సాయంత్రం బీజేపీ కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో.. టీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవ జరిగింది. బీజేపీకి చెందిన ప్రేమ్‌కుమార్ అనే కార్యకర్తపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికి ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.