Bike Thieves’ Gang Busted: యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనం చేస్తున్న ముఠా అరెస్ట్, బంగారు ఆభరణాలు, 23 బైకులు స్వాధీనం

|

Jan 17, 2021 | 11:57 AM

యూట్యూబ్ వీడియోలు చూసి తమ క్రియేటివ్ ను మరింత పెంచుకుని తమకంటూ ఉపాధికల్పించుకునే వారు కొందరు.. అదే యూట్యూబ్ లో వీడియో చూసి వైద్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు.. అయితే తాజాగా..

Bike Thieves Gang Busted: యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనం చేస్తున్న ముఠా అరెస్ట్, బంగారు ఆభరణాలు, 23 బైకులు స్వాధీనం
Follow us on

Bike Thieves’ Gang Busted: యూట్యూబ్ వీడియోలు చూసి తమ క్రియేటివ్ ను మరింత పెంచుకుని తమకంటూ ఉపాధికల్పించుకునే వారు కొందరు.. అదే యూట్యూబ్ లో వీడియో చూసి వైద్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు.. అయితే తాజాగా కొంతమంది యువకులు తాము అందరికంటే భిన్నం అంటూ యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ.. ఇళ్ల‌లో దొంగ‌త‌నాలు, బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. ఈ అంత‌రాష్ట్ర‌ దొంగ‌ల ముఠాను హైద‌రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చాలా ప్రాంతాల్లోని ఇల్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకున్న ఈ ముఠా దొంగతనానికి పాల్పడుతున్నారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, సంగారెడ్డి లలోని ప‌లు ప్రాంతాల్లో ఈ ముఠా నేరాలకు పాల్పడుతున్నార‌ని పోలీసులు చెప్పారు. నిందితుల పై మర్డర్ కేసులు కూడా ఉన్నాయని, ఇద్దరు రిసీవర్ లను కూడా అరెస్ట్ చేశామన్నారు. 26 ఇళ్ల చోరీ కేసులను చేధించామ‌ని, రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 23 బైకులు స్వాధీనం చేసుకున్నామ‌ని అన్నారు. నిందితులపై పీడి యాక్ట్ నమోదు చేస్తామ‌ని సీపీ తెలిపారు.

Also Read: జమ్మూ శ్రీనగర్ హైవే రాంబన్ వద్ద కూలిన వంతెన, కేవలం 60 గంటల్లోనే నిర్మించిన సైన్యం