ఫేస్‌బుక్‌లో యువతి నగ్న ఫొటోలు, వీడియోలు.. ఎలా వచ్చాయో ఆరా తీస్తే.. అసలు వివరాలు వెలుగులోకి..
Bhopal Man Facebook Posts : భోపాల్‌లోని కోలార్ ప్రాంతంలో పెళ్లికి నిరాకరించినందుకు 22 ఏళ్ల యువతిపై దాడి చేసి ఆమె నగ్న ఫొటోలను, వీడియోలను
Bhopal Man Facebook Posts : భోపాల్‌లోని కోలార్ ప్రాంతంలో పెళ్లికి నిరాకరించినందుకు 22 ఏళ్ల యువతిపై దాడి చేసి ఆమె నగ్న ఫొటోలను, వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు ఓ దుర్మార్గుడు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంజన్ కుమార్ ఠాకూర్ అనే వ్యక్తి కోలార్ ప్రాంతానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవాలని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. అందుకు ఆమె తిరస్కరించింది. ఇటీవల ఆ యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరగబోతుందని రంజన్ కుమార్ తెలుసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడై ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసం ఓ పథకం వేసాడు.
మాట్లాడాలని చెప్పి ఆమెను కోలార్‌లోని ఓ ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై దాడి చేసి సెల్‌ఫోన్‌లో నగ్న ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. అతడి భారి నుంచి ప్రాణాలతో బయటపడిన యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంజన్ కుమార్ ఠాకూర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మన దేశంలో మహిళల రక్షణకు అనేక చట్టాలు అమలులో ఉన్నాయి. ఎటొచ్చి వాటిని మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. చట్టాల గురించి అవగాహన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. మహిళల్లో అక్షరాస్యత తక్కువ. సహజంగానే వారికి తమ రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి తెలియదు. తెలిసినా వినియోగించుకునే స్వేచ్ఛ ఉండదు. అనేక సామాజిక కట్టుబాట్లు తమపై జరుగుతున్న లైంగిక దాడులు, గృహహింస, వివక్షకు వ్యతిరేకంగా పోరాడకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ఈ బంధనాలను ఛేదించుకొని అణిచివేతకు వ్యతిరేకంగా చేపట్టేపోరాటానికి అండగా ఉండడానికి, రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయి. వాటిని సమర్ధవంతంగా సద్వినియోగం చేసుకోగలిగితే మహిళలకు తిరుగేలేదు.