FIR registered against Amazon sellers: వివిధ ఉత్పత్తులపై జాతీయ చిహ్నాలను ముద్రించినందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ విక్రయదారులపై భోపాల్ క్రైమ్ బ్రాంచ్ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. షూస్, మగ్‌లు, టీ-షర్టులపై జాతీయ చిహ్నాలను ముద్రించినందుకు అమెజాన్ కంపెనీకి నోటీసులు వెళ్లనున్నట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ మక్రంద్ డ్యూస్కర్ పేర్కొన్నారు. నేషనల్ హానర్ అమెండమెంట్ యాక్ట్ కింద సెక్షన్ 2, సెక్షన్ 505 (2) ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. త్రివర్ణ పతాకానికి చెందిన చిత్రాలు/ముద్రలతో కూడిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అమెజాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదేశించినట్లు జనవరి 25 (మంగళవారం)న మీడియాకు వెల్లడించారు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ విక్రయిస్తున్న ఉత్పత్తులపై మన జాతీయ జెండాను ఉపయోగిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. జాతీయ జెండా చిహ్నాలను బూట్లపై ఉపయోగించడాన్ని సహించలేమని మిశ్రా ఓ పత్రికా ప్రకటనలో అన్నారు. ప్రాథమికంగా ఇది ‘జాతీయ జెండా కోడ్’ను ఉల్లంఘించడం అవుతుందని, అందువల్ల అమెజాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)ని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
ఐతే అమెజాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని మిశ్రా పోలీసులను ఆదేశించడం ఇదేం మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్‌లో కూడా ఈ-కామర్స్ సైట్ ద్వారా విషపూరిత సల్ఫస్ (వ్యవసాయానికి వినియోగించే) టాబ్లెట్‌లను ఆర్డర్ చేయడం ద్వారా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అమెజాన్ అఫీషియల్స్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మిశ్రా ఆదేశించాడు.
Also Read: