
తనకు పుట్టిన నశజాత శిశువును వేడినీటి పాత్రలో వేసి ఉడికించి చంపేసిందనే ఆరోపణలో ఓ 27 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేసినట్లు కొన్ని నివేదికల ఆధారంగా తెలుస్తోంది. వివరాళ్లోకి వెలితే.. బెంగళూరులోని విశ్వేశ్వరపురానికి చెందిన ఓ మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఉద్యోగం కోల్పోయి మద్యానికి బానిసైన భర్త.. తనను పట్టించుకోకపోవడంతో సదురు మహిళ తిరిగి పుట్టింటికి వచ్చి.. తల్లిదండ్రులతోనే నివాసం ఉంటున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అయితే ఆమె ఇటీవలే నెలలునిండకుండా ఒక నవజాత శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డలో కొన్ని లోపాలు ఉన్నట్టు అనుమానించిన ఆ మహిళ తరచూ ఏడుస్తున్న బిడ్డకు పాలు ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. నెలలు నిండకుండానే జన్మించిన బిడ్డ సరిగ్గా లేదనే.. నిరాశకు లోనై మహిళ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
సోమవారం ఉదయం వేడినీటిలో శిశువును చూసిన ఆమె తల్లిదండ్రులు కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేడినీటిలో కాలినగాయలతో ఉన్న నవజాత శిశువును గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఘటనపై కేసు నమోదు చేశారు. శిశువుకు జన్మనిచ్చిన తల్లే ఈ దారుణానికి పాల్పిందన్న అనుమానంతో ఆమెను అరెస్ట్ చేశారు. కాగా భర్త దగ్గర నుంచి తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చినప్పటి నుంచి ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు గుర్తించారు. అందువల్లనే ఆమె దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.