Crime News: బెంగళూరులో బరితెగించిన యువకుడు.. ప్రేమించలేదని నగలతో పరార్.!
Bangalore Crime News: ప్రేమ కాస్తా పగగా మారింది. తనను కాదని తన ప్రియురాలు వేరొకరితో తిరుగుతోందని తెలుసుకున్న ఓ ప్రియుడు ఆమెపై కక్ష..

Bangalore Crime News: ప్రేమ కాస్తా పగగా మారింది. తనను కాదని తన ప్రియురాలు వేరొకరితో తిరుగుతోందని తెలుసుకున్న ఓ ప్రియుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను నిలువు దోపిడీ చేశాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బెంగళూరుకు చెందిన జాకీర్ హుసేన్ అనే వ్యక్తి కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె అతడిని కాదని.. వేరొకరితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ పన్నాగం పన్నాడు. ఈ నెల 13వ తేదీన ఆ యువతి ఒంటరిగా వెళ్తుండటం తెలుసుకుని చంద్రలేఔట్ భైరవేశ్వరనగర్ వద్ద దుండగులు మాదిరిగా ఆమెను అడ్డగించి 102 గ్రాముల బంగారు నగలు దోచుకున్నారు.
కాగా, ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు జాకీర్‌హుసేన్, షాబాజ్‌ఖాన్, ఫాజిల్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇక తనని కాదని వేరొకరితో తిరుగుతోందన్న కక్షతోనే ఈ పని చేశామని జాకీర్ హుసేన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.
Also Read:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!
జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!
బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…