AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: స్నేహితులతో సరదాగా మాట్లాడుతుండగా ఊహించని ప్రమాదం.. చూస్తుండగానే మృత్యుఒడికి..

Hyderabad: సరాదాగా స్నేహితులతో మాట్లాడుతోన్న ఓ బీటెక్‌ విద్యార్థినికి అనుకోను ప్రమాదం ఎదురైంది. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ యువతి క్షణాల్లోనే మృత్యుఒడిలోకి చేరింది. వివరాల్లోకి వెళితే..

Hyderabad: స్నేహితులతో సరదాగా మాట్లాడుతుండగా ఊహించని ప్రమాదం.. చూస్తుండగానే మృత్యుఒడికి..
Narender Vaitla
|

Updated on: Jul 24, 2022 | 8:22 AM

Share

Hyderabad: సరాదాగా స్నేహితులతో మాట్లాడుతోన్న ఓ బీటెక్‌ విద్యార్థినికి అనుకోను ప్రమాదం ఎదురైంది. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ యువతి క్షణాల్లోనే మృత్యుఒడిలోకి చేరింది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి పట్టణానికి చెందిన రమ్య (21), హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్‌ థార్డ్‌ ఇయర్‌ చదువుతోంది. కుటుంబం ఉప్పల్‌లో నివాసముంటున్నా.. అక్కడి నుంచి కాలేజీ దూరమవుతోందన్న కారణంతో రమ్య వనస్థలిపురంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్ట్‌లో ఉంటూ కాలేజీ వెళ్లి వస్తోంది.

ఈ క్రమంలోనే శనివారం కళాశాల నుంచి వచ్చిన రమ్య రాత్రి.. హాస్టల్‌ సెకండ్‌ ఫ్లోర్‌లో ఉన్న రెయిలింగ్‌పై కూర్చొని స్నేహితులతో మాట్లాడుతోంది. ఆ సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పడంతో వెనక్కుపడిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో రమ్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర స్థాయిలో రక్తస్రావం కావడంతో రమ్య అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హాస్టల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని రమ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే రమ్య తండ్రి శోభన్‌ రెడీమిక్స్‌ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..