మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఓ ఆటో డ్రైవర్‌ను హత్య చేసి, తలను మొండెంనుంచి వేరు చేసి దూరంగా పడేశారు. ఈ సంఘటన గురువారం అర్థరాత్రి ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. గురువారం రాత్రి ప్రవీణ్(24) అనే ఆటో డ్రైవర్‌ను శ్రీను, శ్రీకాంత్‌లు మద్యం సేవించటానికి పిలిచారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ ధర్మపురి క్షేత్రం వద్ద మరో వ్యక్తితో కలిసి నలుగురు మద్యం సేవించారు. పూటుగా మద్యం సేవించిన తర్వాత పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని శ్రీను, శ్రీకాంత్‌లు ప్రవీణ్‌పై గొడవకు దిగారు.
ముందుగా అనుకున్న ప్రకారం అతడ్ని హత్య చేశారు. అనంతరం తలను మొండెం నుంచి వేరుచేసి దూరంగా బొల్లారం చౌరస్తాలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య కేసులో నిందితులైన శ్రీను, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.