Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమా వాహనంపై వైసీపీ కార్యకర్తల దాడి.. కారు అద్దాలు ధ్వంసం

|

Jul 27, 2021 | 9:11 PM

Devineni Uma Maheswara Rao: మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్‌ నాయనకుడు దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై వైపీపీ వర్గీయులు

Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమా వాహనంపై వైసీపీ కార్యకర్తల దాడి.. కారు అద్దాలు ధ్వంసం
Attack On Tdp Leader Devineni Uma Vehicle
Follow us on

Devineni Uma Maheswara Rao: మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్‌ నాయనకుడు దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై వైపీపీ వర్గీయులు రాళ్లదాడికి దిగారు. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా మంగళవారం పరిశీలనకు వెళ్లారు. సాయంత్రం వేళ తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద వైఎస్ఆర్ సీపీ వర్గీయులు అడ్డుకున్నారు. వాహనం చుట్టుముట్టి దాడి చేశారు. రాళ్లదాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న టీటీపీ వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం దేవినేని ఉమా వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. అనంతరం దేవినేని ఉమా జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అనుచరులే తనపై దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. కాగా.. ఘటనకు సంబంధించి దేవినేని ఉమకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు.

Also Read:

AP Debts: ఏపీ సర్కార్ అప్పులపై పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన.. ఎలాంటి మదింపు చేయలేదని స్పష్టం

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు ఇష్యూపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్..