Nepal Bus Accident: నేపాల్‌లోని ముగు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నేపాల్‌గంజ్ నుంచి ముగు జిల్లా కేంద్రం గంగఢీ వైపు వెళ్తున్న బస్సు పినా ఝ్యారీ నదిలో పడింది. ఈ ఘటనలో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. విజయదశమి పండుగ కోసం.. ప్రయాణికులంతా వేర్వేరు ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు సైన్యం రంగంలోకి దిగింది.
వాయువ్య నేపాల్‌లోని కొండ ప్రాంతంలో ప్యాక్ చేసిన ప్యాసింజర్ బస్సు రోడ్డుపై నుండి దూసుకెళ్లడంతో మంగళవారం 28 మంది మరణించగా, 16 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. మారుమూల ముగు ప్రాంతంలో బస్సు ముందు టైర్లలో ఒకదానికి పంక్చర్ అయినట్లు జిల్లా అధికారి రోమ్ బహదూర్ మహత్ చెప్పారు. బస్సు దక్షిణ బాంకే జిల్లా నుండి ముగు ప్రాంతానికి వెళ్తోంది. హిందూ పండుగ దశైన్ పండుగను జరుపుకోవడానికి చాలా మంది ప్రయాణిస్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో కనీసం 45 మంది ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్నారు.
గాయపడినవారిని చికిత్స కోసం హెలికాప్టర్లు ద్వారా ఆసుపత్రులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రమాద స్థలంలో ప్రాణాలతో బటపడ్డవారిని, బాధితుల కోసం పోలీసులు స్థానికుల సహాయంతో వెతుకుతూనే ఉన్నారు. కొండ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు తరుచుతున్న అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇదిలావుంటే, ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019 లో నేపాల్‌లో దాదాపు 13,000 రోడ్డు ప్రమాదాల్లో 2,500 మందికి పైగా మరణించారు.
Read Also…Gas Leak: మహారాష్ట్రలోని రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్.. 34 మందికి ఆస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..