Fibernet Scam: అక్రమాల డొంక కదులుతోంది.. ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలపై అరెస్ట్‌ల పర్వం మొదలైంది

అక్రమాల డొంక కదులుతోంది. ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలపై అరెస్ట్‌ల పర్వం మొదలైంది. IRS అధికారి సాంబశివరావును CID అరెస్ట్‌ చేసింది

Fibernet Scam: అక్రమాల డొంక కదులుతోంది.. ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలపై అరెస్ట్‌ల పర్వం మొదలైంది
Ap Fibernet

Updated on: Sep 18, 2021 | 9:59 PM

Andhra Pradesh “Fibernet Scam”: అక్రమాల డొంక కదులుతోంది. ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలపై అరెస్ట్‌ల పర్వం మొదలైంది. IRS అధికారి సాంబశివరావును CID అరెస్ట్‌ చేసింది. వైద్య పరీక్షల కోసం ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫైబర్‌నెట్ స్కాంలో సిఐడి దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 18 మంది నిందితులపై కేసు నమోదు చేసిన సీఐడీ, టెరాసాఫ్ట్ కంపెనీ మోసాల కీలక ఆధారాలు సేకరించింది.

ఇప్పటికే వేమూరి హరిప్రసాద్‌, మాజీ ఎండీ సాంబశివరావు సహా పలువురుని విచారించింది. గత ఐదు రోజుల సిఐడి అధికారుల విచారణలో కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే IRS అధికారి సాంబశివరావును అరెస్ట్ చేశారు. హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ను టెరాసాఫ్ట్ కంపెనీ మోసం చేసినట్లుగా సీఐడీ గుర్తించింది. ఆ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ కె.జైన్‌ నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం సేకరించింది.

టెరాసాఫ్ట్ కంపెనీకి కొన్ని అర్హతలు లేనందునే తమను ఇన్వాల్వ్ చేసినట్లు సీఐడీకి చెప్పారు అనిల్. తమకు రావాల్సిన వాటా కూడా ఇవ్వలేదన్నాడు. ఈ అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్న సీఐడీ మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read also: TMC: బెంగాల్‌లో బీజేపీకి వరుస షాకులు.. టీఎంసీలోకి కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో, క్యూలో మరింతమంది.!