Mumbai Drug Case: ఆర్యన్‌ ఖాన్‌కు షాక్‌.. మరో ఆరు రోజులు జైల్లోనే.. 20న బెయిల్‌పై తీర్పు..

|

Oct 14, 2021 | 5:16 PM

Arayan khan bail update: ముంబై డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ.. ఆసక్తికరంగా మారుతోంది. ప్రముఖ నటుడు షారూఖ్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు గురువారం బెయిల్ లభిస్తుందని

Mumbai Drug Case: ఆర్యన్‌ ఖాన్‌కు షాక్‌.. మరో ఆరు రోజులు జైల్లోనే.. 20న బెయిల్‌పై తీర్పు..
Mumbai Drug Bust Case
Follow us on

Arayan khan bail update: ముంబై డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ.. ఆసక్తికరంగా మారుతోంది. ప్రముఖ నటుడు షారూఖ్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు గురువారం బెయిల్ లభిస్తుందని అందరూ ఊహించారు. కానీ ముంబై కోర్టు ఆర్యన్ షాక్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌పై తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసింది. దీంతో ఆర్యన్‌ ఖాన్‌ 20 వరకు జైల్లో ఉండనున్నాడు. 20వ తేదీన కోర్టు బెయిల్‌పై తీర్పు ఇవ్వనుంది. దీంతో షారుఖ్‌ తనయుడు మరో ఆరు రోజులు జైలులోనే ఉండనున్నాడు. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు గురువారం కూడా ముంబై సెషన్స్ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఎన్సీబీ తరపు న్యాయవాది మరోసారి వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కోర్టు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వాదనలు వినిపించిన ఎన్‌సీబీ.. ఆర్యన్‌ డ్రగ్స్‌కు బానిస అని , క్రూయిజ్‌లో దొరికిన డ్రగ్స్‌ ఆర్యన్‌ కోసమే తీసుకొచ్చారని తెలిపింది. దీనిపై కోర్టుకు సాక్ష్యాలు ఇచ్చినట్టు తెలిపింది. ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ పెడ్లర్స్‌తో ఆర్యన్‌కు సంబంధాలు ఉన్నాయని , విదేశాల నుంచి భారీగా డ్రగ్స్‌ తెప్పించేందుకు ఆర్యన్‌ ప్రయత్నిస్తున్నడని ఎన్సీబీ సంచలన ఆరోపణలు చేసింది. అయితే.. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై న్యాయమూర్తి ఏ తీర్పు ఇవ్వబోతున్నారన్న విషయంపై గురువారం ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపధ్యంలో ఆర్యన్‌ ఈ రోజు కూడా బెయిల్‌ రాకపోవడంతో షారుఖ్‌ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఉదయం నుంచి బెయిల్‌ వస్తుందని వార్తలోచ్చాయి. ఈ క్రమంలోనే కోర్టు ఆర్యన్‌కు మరోసారి షాక్‌ ఇస్తూ తీర్పును రిజర్వ్‌ చేసింది.

 

Also Read:

Ayodhya: అయోధ్యలో కలకలం.. దుర్గా పూజ మండపం వద్ద కాల్పులు.. ఒకరు మృతి..

Fire Accident: నిద్రిస్తుండగా భారీ ప్రమాదం.. 46 మంది అగ్నికి ఆహుతి.. 55 మందికి..