సోషల్ మీడియా వేదికగా అలాంటి నేరాలు.. కఠిన చర్యలు తప్పవన్న అధికారులు

| Edited By: Srikar T

May 31, 2024 | 5:17 PM

ఏపీలో పసి పిల్లలను విక్రయించినా, అనధికారికంగా దత్తత స్వీకరించినా కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నెల నుండి ఒక సంవత్సరంలోపు కొంతమంది శిశువులును వివిధ ప్రాంతాల నుండి అక్రమంగా సేకరించినట్లు గుర్తించామన్నారు.

సోషల్ మీడియా వేదికగా అలాంటి నేరాలు.. కఠిన చర్యలు తప్పవన్న అధికారులు
Social Media
Follow us on

ఏపీలో పసి పిల్లలను విక్రయించినా, అనధికారికంగా దత్తత స్వీకరించినా కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నెల నుండి ఒక సంవత్సరంలోపు కొంతమంది శిశువులును వివిధ ప్రాంతాల నుండి అక్రమంగా సేకరించినట్లు గుర్తించామన్నారు. సంతానం కలగలేని దంపతులను లక్ష్యంగా చేసుకుని దేశంలోని ప్రధాన నగరాల్లో విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. పసి పిల్లలును కొన్ని లక్షలకు విక్రయిస్తున్న కొంతమంది అంతరాష్ట్ర ముఠాను పోలీసు అధికారులు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 16 మంది శిశువులను గుర్తించినట్లు తెలిపారు. వారిని హైదరాబాద్ శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, రాష్ట్ర పోలీస్ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి నివేదికను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‎కు సమర్పించాలని కోరారు.

అలాగే మీడియాల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ బాలల వివరాలు సేకరించడంతో పాటు బాలల అక్రమ రవాణా రాకెట్‌ వెనుక ఉన్నవారిని గుర్తించాలన్నారు. ఇటీవల దేశంలోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన ఒక సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలల అక్రమ రవాణాను ప్రత్యేక నెట్వర్క్స్ రూపొందించి ఎక్స్ సోషల్ మీడియా వేదికగా నడుపుతున్నట్లు తెలిపారు. పసిపిల్లలు ఫొటోలు పంపించి అడ, మగ లింగానికి ఒక ప్రత్యేక కోడ్‎లను ఉపయోగించి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు.

రాష్టంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిల్లో, ఫెర్టిలిటీ కేంద్రాలు, క్లినిక్‎లలో నిరంతరం నిఘా, పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. గ్రామ స్థాయిలో అంగన్వాడి, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ ఉండేలా చూడాలని రాష్ట్ర అధికారులను కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే శిశువుల విక్రయాల అంశంపై ఎటువంటి సమాచారం అందినా వెంటనే బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకురావాలని తెలిపింది. వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసుకుని వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…