ఇద్దరు పిల్లలను బావిలో తోసేసిన కసాయి తల్లి.. కలచివేస్తున్న హృదయ విదారక ఘటన

|

Mar 06, 2022 | 8:35 AM

Ap Crime: ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో.. అత్యంత ఘోరానికి పాల్పడింది. ఏ తల్లీ చేయకూడని పని చేసింది. మాతృమూర్తులు తలదించుకునే దారుణానికి తెగబడింది..

ఇద్దరు పిల్లలను బావిలో తోసేసిన కసాయి తల్లి.. కలచివేస్తున్న  హృదయ విదారక ఘటన
Follow us on

Ap Crime: ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో.. అత్యంత ఘోరానికి పాల్పడింది. ఏ తల్లీ చేయకూడని పని చేసింది. మాతృమూర్తులు తలదించుకునే దారుణానికి తెగబడింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న బిడ్డల్ని కనికరం లేకుండా కడతేర్చింది. ఈ హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh)లో జరిగింది. కర్నూలు (Kurnool) రూరల్‌ మండలం పూలతోట గ్రామంలో ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసిన తల్లి, ఆమె కూడా అదే బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కానీ, ఆమె ఒకటి తలిస్తే, ఇంకొకటి జరిగింది. పిల్లలిద్దరూ నీటిలో మునిగి మరణిస్తే, తల్లి మాత్రం ప్రాణాలతో సేఫ్‌గా బయటపడింది. కుటుంబ కలహాలో, లేక ఇంకేదైనా కారణమో?. కారణం ఏదైనా అభంశుభం తెలియని చిన్నారులను బలి తీసుకుంది తల్లి. బుడిబుడి అడుగులేస్తూ అప్పటివరకు ఇంటి ముందు ఆడుకున్న పిల్లలు, అదే ఇంటి ముందు విగతజీవులుగా చూసి, వెక్కివెక్కి ఏడుస్తున్నారు కుటుంబ సభ్యులు.

పిల్లలను చూసి తట్టుకోలేకపోతున్న బంధువులు:

ముద్దుముద్దు మాటలతో అప్పటివరకు ఇంట్లో నవ్వులు పూయించిన పిల్లలు, అచేతనంగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు బంధువులు. కుటుంబంలో గొడవలుంటే, మధ్యలో వీళ్లేం చేశారు. చిన్న పిల్లలను చంపడానికి నీకు మనసెలా వచ్చింది. ఎంత ఘోరం చేశావమ్మా? అంటూ భోరున విలపిస్తున్నారు. నవారు మంచంపై విగతజీవులుగా పడివున్న పిల్లల్ని చూసి గుండెలు బాదుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ఆడుకుని, అలసిపోయి మంచంపై పడుకోవాల్సిన పిల్లలు, శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారా? అంటూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. దేవుడా ఈ ఘోరాన్ని ఎందుకు ఆపలేదయ్యా అంటూ ప్రశ్నిస్తున్నారు.

అమ్మా! మేమేం చేశామమ్మా! మమ్మల్నెందుకు చంపావమ్మా! గోరు ముద్దలు తినిపించిన ఆ చేతులతోనే మమ్మల్నెలా బావిలోకి తోశావమ్మా? నీకు మనసెలా వచ్చిందమ్మా? మమ్మల్ని చంపే హక్కు నీకెక్కడిది అమ్మా? మీ గొడవలకు మమ్మల్ని ఎందుకు బలి తీసుకుంటారమ్మా? అంటూ తమ తల్లిని ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తున్నాయ్‌ ఆ చిన్నారుల ముఖాలు. నవారు మంచంపై అచేతనంగా పడివున్న ఆ పిల్లలు సంధిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు?.. ఈ ఘటన అందరికి హృదయాలను కలచివేసింది.

ఇవి కూడా చదవండి:

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు లోయలో పడి ఐదుగురు దుర్మరణం..

Telangana: దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం