AP Crime News: గుంటూరు జిల్లాలో దారణం.. చెడు వ్యసనాలకు బానిసైన అల్లుడిపై మామ కత్తితో దాడి

Guntur Crime News: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. చెడు వ్యసనాలకు బానిసై భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తపై అతని మామ, బావ మరిది కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

AP Crime News: గుంటూరు జిల్లాలో దారణం.. చెడు వ్యసనాలకు బానిసైన అల్లుడిపై మామ కత్తితో దాడి
Crime News

Updated on: Oct 09, 2021 | 11:54 AM

Guntur Crime News: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. చెడు వ్యసనాలకు బానిసై భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తపై అతని మామ, బావ మరిది కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువులో  ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు స్థానికుడు చిన్న కాశిం గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. నిత్యం భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. చెడు వ్యసనాలు మానుకోవాలని భార్య కుటుంబీకులు చెప్పినా.. చిన్న కాశిం తీరులో మార్పు రాలేదు. కొన్ని రోజుల క్రితం భార్యను చిన్న కాశీం మరోసారి వేధించాడు.  ఈ విషయమై చిన్న కాశింను అతని మామ నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో చిన్న కాశింపై అతని మామ, బావ మరిది కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన చిన్న కాశింను చికిత్స కోసం పిడుగురాళ్ల ప్రయివేటు హాస్పిటల్‌కు తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. మామా పిరు సాహెబ్, బావ మరిది భాషాలను  అదుపులోకి తీసుకున్నారు. అల్లుడిపై మామ, బావ మరిది కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Also Read..

చాణక్య నీతి: ఈ మూడు విషయాలు విద్య, సంపద, సైన్యాన్ని నాశనం చేస్తాయి.. అవేంటంటే..!

Che guevara: పెట్టుబడిదారుల పాలనకు సింహస్వప్నం..చే గువేరా! ఆ విప్లవసింహం హత్య జరిగి 55 ఏళ్ళు!!