త్రిపురలో భారీగా డ్ర్గగ్స్ పట్టుబడ్డాయి. త్రిపుర పోలీసు విభాగంలోని యాంటీ నార్కోటిక్ టీం జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ ఉన్నాయన్న పక్కా సమాచారం అందడంతో.. త్రిపుర రాజధాని అగర్తలోని శాంతిపర ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో పెద్ద ఎత్తున యాబా టాబ్లెట్లు, హెరాయిన్ ప్యాకెట్లను గుర్తించారు. అంతేకాదు. రూ.13 లక్షల క్యాష్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇంకా తనిఖీలు చేపడుతున్నామని.. పట్టుబడ్డ వ్యక్తిని విచారణ చేపడుతున్నామన్నారు. కాగా, గత కొద్ది రోజులుగా అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు డ్రగ్స్ దందాపై ప్రత్యేక దృష్టిసారించారు.
Anti-Narcotics Unit of Tripura police has seized a huge quantity of drugs, consisting of Yaba tablets & heroin from a house in Santipara in the capital Agartala. Around Rs 13 lakhs cash recovered & one person arrested so far. Seizure operation is still continuing: Tripura Police pic.twitter.com/mvClwXXLgG
— ANI (@ANI) August 19, 2020
Read More :