Ap News: వామ్మో! దాహంతో వెళ్తే.. రాకాసి ఫ్రిడ్జ్ నిండు ప్రాణాన్ని మింగేసింది..

Ap News: రిఫ్రిజిరేటర్‌ తలుపు తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందగా... ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ..

Ap News: వామ్మో! దాహంతో వెళ్తే.. రాకాసి ఫ్రిడ్జ్ నిండు ప్రాణాన్ని మింగేసింది..

Edited By:

Updated on: Apr 22, 2022 | 7:06 PM

Ap News: రిఫ్రిజిరేటర్‌ తలుపు తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందగా… ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. సీఐ మధుబాబు, కుటుంబీకులు వివరాల మేరకు.. కాతేరు జలకాలువపేటకు చెందిన గరికిన మసీన్‌ అతడి సోదరులు కృష్ణంరాజు(37), పోసియ్య ఒకే ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నీళ్లు తాగేందుకు మసీన్‌ ఫ్రిజ్‌ (Fridge) డోర్‌ తీశాడు. ఆ సయమంలో హైవోల్టేజ్‌ రావడంతో షాక్‌ తగిలి ఒక్కసారిగా కేకలు వేశారు. అన్నను రక్షించేందుకు పక్కనే ఉన్న కృష్ణంరాజు పట్టుకుని లాగబోయాడు. దీంతో ఇద్దరికి షాక్‌కు తగిలింది. ఇక వీరిని కాపాడదామనే టెన్షన్‌లో వారి భార్యలు నూకరత్నం, సూర్యకాంతం వారిని పట్టుకుని రక్షించే ప్రయత్నం చేశారు. విద్యుత్ షాక్ కు గురయ్యారు.

ఇక దీనిని గమనించిన పోసియ్య ఓ కర్రతో కొట్టి ఫ్రిజ్‌ షాక్‌ నుంచి తప్పించాడు. ఈ ఘటనలో కృష్ణంరాజు అపస్మారక స్థితికి చేరడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు చెప్పారు. మిగతా ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Uttar Pradesh: ప్లాట్‌ఫాంపై కానిస్టేబుల్‌.. పట్టాలపై గూడ్స్‌ రైలు.. అంతలో..

Vijayawada: సామూహిక అత్యాచారం ఘటనలో ప్రభుత్వం సీరియస్.. పోలీసులపై సస్పెన్షన్ వేటు

Loading...
Unable to load recommendations.
Follow Us