Paritala Siddharth: పరిటాల సిద్ధార్థ్ వద్ద బుల్లెట్ కలకలం.. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని పోలీసుల డెడ్‌లైన్‌..

మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కొడుకు సిద్ధార్థ్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లి బ్యాగ్‌లో బుల్లెట్‌‌తో దొరికిన కేసులో..

Paritala Siddharth: పరిటాల సిద్ధార్థ్ వద్ద బుల్లెట్ కలకలం.. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని పోలీసుల డెడ్‌లైన్‌..
Paritala Siddharth

Updated on: Aug 21, 2021 | 7:13 PM

మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కొడుకు సిద్ధార్థ్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లి బ్యాగ్‌లో బుల్లెట్‌‌తో దొరికిన కేసులో ఆయన్ను విచారించారు పోలీసులు. 41 CRPC ప్రకారం నోటీసులిచ్చి విచారణకు పిలిచారు. పోలీసులు, ఆర్మీ వాళ్ళ దగ్గర ఉండే ఆ బుల్లెట్‌ అతనివద్దకు ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారన్న కోణంలో విచారించారు. ఆర్డ్మ్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని డెడ్‌లైన్‌ పెట్టారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే… 

ఈ బుధవారం శ్రీనగర్‌కు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు పరిటాల సిద్ధార్థ. చెకింగ్‌లో ఆయన బ్యాగ్‌లో బుల్లెట్‌ను గుర్తించారు పోలీసులు. ఇది నిబంధనలకు విరుద్ధం. దాంతో ఆయనకు నోటీసులు ఇచ్చారు. సిద్ధార్థకు పాయింట్‌ 32 క్యాలిబర్‌ గన్‌కు లైసెన్స్‌ ఉంది. అయితే ఎయిర్‌పోర్టులో మాత్రం ఆయన బ్యాగ్‌లో 5.56 క్యాలిబర్‌ బుల్లెట్‌ దొరకడం సంచలనంగా మారింది. 5.56 క్యాలిబర్‌ వెపన్స్‌ను కేవలం సాయుధ బలగాలు మాత్రమే వాడతాయి. అలాంటింది ఆ బుల్లెట్‌ సిద్ధార్థ బ్యాగ్‌లోకి ఎలా వచ్చిందన్నది మిస్టరీగా మారింది. అనంతపురం జిల్లాకు చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌కు చెందిన బుల్లెట్టే సిద్ధార్థ దగ్గరకు వచ్చిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఆ కానిస్టేబుల్‌కు పరిటాల కుటుంబానికి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులోనే బుధవారం నోటీసులిచ్చి కేసు నమోదు చేశారు శంషాబాద్‌ పోలీసులు. ఇప్పుడు ఏసీపీ ముందు విచారణకు హాజరయ్యారు సిద్ధార్థ. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. వారం రోజుల్లో సరైన సమాధానం ఇవ్వాలని లేదంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు పోలీసులు. సాయుధ బలగాలు వాడే బుల్లెట్‌ను బయటి వ్యక్తులు కలిగి ఉండటం నిబంధనలకు విరుద్ధం. కాబట్టే సిద్ధార్థపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఈ కేసులో మూడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read: ఏపీలో కొత్తగా 1217 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ.. కాంగ్రెస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?