దారుణం: ఏడేళ్ల చిన్నారిపై ఎయిడ్స్ రోగి అత్యాచారం..!

దారుణం: ఏడేళ్ల చిన్నారిపై ఎయిడ్స్ రోగి అత్యాచారం..!

తెలంగాణ జిల్లా భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అశ్వారావుపేటలో ఏడేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అశ్వారావు పేటకు చెందిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. వారింటికి సమీపంలోనే ఉండే 23 ఏళ్ల యువకుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఎయిడ్స్ వ్యాధితో బాధపుడుతోన్న యువకుడు.. టీవీ చూసేందుకు తరుచూ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Oct 15, 2019 | 3:43 PM

తెలంగాణ జిల్లా భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అశ్వారావుపేటలో ఏడేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. అశ్వారావు పేటకు చెందిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. వారింటికి సమీపంలోనే ఉండే 23 ఏళ్ల యువకుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఎయిడ్స్ వ్యాధితో బాధపుడుతోన్న యువకుడు.. టీవీ చూసేందుకు తరుచూ మహిళ ఇంటికి వచ్చేవాడు. కాగా.. సోమవారం మహిళ కుమార్తెకు జ్వరం రావడంతో.. మందులు వేసి నిద్రపుచ్చింది. అనంతరం తల్లి పనికి బయటకు వెళ్లింది. దీంతో.. ఇంట్లో ఎవరూ లేరు. ఇది పసిగట్టిన ఆ నిందితుడు.. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సమయంలోనే తల్లి ఇంటికి రావడం.. పరిస్థితిని గమనించి.. పెద్దగా కేకలు వేసింది. దీంతో.. నిందితుడు పరారయ్యాడు. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్థారించారు.

చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు నిందితుడిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైంగిక దాడి కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికోసం గాలిస్తున్నామన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu