Hyderabad: మార్కెట్‌ను ముంచెత్తుతున్న నకిలీ మసాలా దినుసులు.. మీరు కొంటున్నది అసలైనవేనా..?

| Edited By: Balaraju Goud

Feb 27, 2024 | 12:41 PM

నిబంధనలు పాటించరు.. నాణ్యతను గాలికి వదిలేస్తారు.. చచ్చో, పుచ్చో తెచ్చి పేస్ట్ చేసేశామా.. డబ్బాలో పెట్టి అమ్మేశామా..! ఎక్కడ చూసినా ఇదే గలీజ్‌ బిజినెస్.. ఒరిజినల్ ప్రోడక్ట్ తయారు చేసేటటు వంటి వ్యక్తులు సైతం కనిపెట్టలేనంతగా ఈ నకిలీ ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తున్నారు కేటుగాళ్ళు

Hyderabad: మార్కెట్‌ను ముంచెత్తుతున్న నకిలీ మసాలా దినుసులు.. మీరు కొంటున్నది అసలైనవేనా..?
Adulterated Products
Follow us on

నిబంధనలు పాటించరు.. నాణ్యతను గాలికి వదిలేస్తారు.. చచ్చో, పుచ్చో తెచ్చి పేస్ట్ చేసేశామా.. డబ్బాలో పెట్టి అమ్మేశామా..! ఎక్కడ చూసినా ఇదే గలీజ్‌ బిజినెస్.. ఒరిజినల్ ప్రోడక్ట్ తయారు చేసేటటు వంటి వ్యక్తులు సైతం కనిపెట్టలేనంతగా ఈ నకిలీ ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తున్నారు కేటుగాళ్ళు. కూరల్లో వేసుకునే కారం నుండి మొదలుకుంటే స్నాక్స్ లో వేసుకుని సాసుల వరకు అన్ని కల్తీలే.. చాక్లెట్లు బిస్కెట్లు టాబ్లెట్లు అని తేడా లేకుండా అన్ని కలిపి చేస్తూ ప్రజల ప్రాణాలతో చేలాగటమడుతున్నారు…

ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. ధరలు అలా పెరుగుతున్నాయి.మటన్‌ చికెన్‌ కన్నా అల్లం వెల్లులు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు అల్లం వెల్లుల్లి ఫేస్ట్‌ను కల్తీ చేసి అమ్మకాలు మొదలుపెట్టారు.

ఆదివారం వస్తే పక్కా ముక్క లేనిదే ముద్ద దిగదు కొందరికి.. ఇక గుమగుమలాడాలంటే అల్లం, వెల్లుల్లి పేస్ట్ తప్పనిస.రి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ఏ విధంగా చేస్తారో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. అరటి గెలకు ఉండేటటువంటి మధ్యలో ఉన్న బెరడును తీసి దాన్ని దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వాసనకు యాడ్ చేస్తున్నారు మాయగాళ్లు. అంతే ఇక గుమగుమలాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువుల్లోనూ కల్తీ చేస్తున్నారు. తాజాగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే రకం దందాకు తెరతీశాడు.

అది కూడా శ్రీ సాయి నగర్ కాలనీలో అనుమతి లేనటువంటి ఇంట్లో కత్తి మిశ్రమాన్ని తయారు చేస్తూ పోలీసులకు పట్టబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుట్టుచప్పుడు కాకుండా కల్తీ మిశ్రమాలను తయారు చేస్తున్న పట్టు రాజు అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా కల్తి మిశ్రమాలను తయారు చేస్తున్నాడు. పక్కా సమాచారంతో ఈ ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించిచ, మసాలా పల్లి, పచ్చి బఠాని, ఫుడ్ కలర్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండానే అత్యాశతో కల్తీ మిశ్రమం తయారు చేసి సులభంగా డబ్బులు సంపాదించడానికి ఈ పన్నాగం పన్నినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్‌‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించడంతో అసలు బండారం బయటపడింది. ఇలా తయారు చేసిన కల్తీ మిశ్రమాలను కిరాణ దుకాణాలకు, బేకరీ షాప్‌లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…