డ్రగ్స్.. ప్రపంచాన్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య. భవిష్యత్‌లో అద్భుతాలు చేయాల్సిన యువతీయువకులు ఈ మత్తు పదార్థాల వలలో చిక్కి.. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు, పోలీస్ అధికారులు ఎన్ని ఆంక్షలు పెడుతున్నా, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. మత్తు పదార్థాల రవాణా ఆగడం లేదు. డబ్బులు దండుకునేందుకు అక్రమార్కులు.. డ్రగ్స్ అక్రమ రవాణాకు కొత్త కొత్త మార్గాలను అన్వేశిస్తున్నారు. తాజాగా అబుదాబిలో అధిక మొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, కస్టమ్స్ అధికారులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్‌లో 1.5 టన్నుల హెరాయిన్‌ని ఖలీఫా పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ ఇండియన్ కరెన్సీ ప్రకారం 3 బిలియన్ 70మిలియన్ 368 వేల రూపాయలు అని తెలుస్తుంది. ఇంత భారీ మొత్తంలో హెరాయిన్‌ను స్మగ్లింగ్ చేసేందుకు.. అక్రమర్కులు కొత్త మార్గాన్ని అన్వేశించారు. అధికారులను బోల్తా కొట్టించేందుకు పక్కా స్కెచ్ వేశారు. పెట్ డాగ్స్‌కు పెట్టే.. దాణా సంచులలో హెరాయిన్ నింపి.. ఐరోపా దేశానికి ఎగుమతి చేసేందుకు ప్రయత్నించారు. అయితే అధికారులకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ మత్తు ముఠా గుట్టు రట్టయ్యింది. అబుదాబిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.
Abu Dhabi Police seize 1.5 tonnes of heroin hidden in pet food.
Read more: https://t.co/oXrkHmREkJ pic.twitter.com/owFVZRS6fu
— The National (@TheNationalNews) March 11, 2022
Also Read: Chicken Rate: చికెన్ సామాన్యుడికి చిక్కనంటుంది.. నెల రోజుల్లోనే డబుల్ అయిన ధర