ఏకంగా అమ్మవారి హుండీనే టార్గెట్ చేసి సిసి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు ముగ్గురు దొంగలు. నారాయణపేట జిల్లా శివారులోని లోకాయపల్లి లక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున ఓ మహిళా ఇద్దరు పురుషులు చోరీకి పాల్పడ్డారు. హుండీని తనతో తెచ్చుకున్న రాడ్డుతో పగులగొట్టి నగదు, కానుకలను ఎత్తుకెళ్లారు. ఆలయంలో సిసి కెమెరాలు ఉన్న సంగతి తొలుత గ్రహించని ఆ దొంగల ముఠా ఎంచక్కా తన పని పూర్తి చేసుకుంది.
అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల ఎవరూ రారనే ధీమాతో నింపాదిగా దొంగతనానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సిసి కెమెరాలను గమనించి వాటిని ధ్వంసం చేశారు. లోకాయపల్లి లక్ష్మమ్మ అమ్మవారి ఆలయం అటవీ ప్రాంతంలో నిర్మాణుష్య ప్రదేశంలో ఉండడం వల్ల దొంగలు తరచూ జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం కూడా ఈ దేవాలయంలో చోరీ జరిగింది. అయితే తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు కర్ణాటక బార్డర్ అవడం వల్ల అక్కడి దొంగల పని అయి ఉండవచ్చనే కోణంలోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also.. Online Gambling: కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం.. భార్యాపిల్లల్ని చంపి.. ఆపై