AP Crime News : కత్తితో ఆవు కాలు నరికిన క్రూరుడు, బావ కంటిపై కత్తివేటు వేసిన బావమరిది

చిత్తూరు జిల్లాలో అత్యంత కర్కశానికి ఒడిగట్టాడో భూ యజమాని. అతి క్రూరంగా ఆవు కాలు నరికాడు. నోరు లేని మూగజీవి ఆకలితో మేత కోసం పొలంలోకి వెళితే అతి కిరాతకంగా..

AP Crime News : కత్తితో ఆవు కాలు నరికిన క్రూరుడు,  బావ కంటిపై కత్తివేటు వేసిన బావమరిది
Cow And Calf

Updated on: Jul 27, 2021 | 2:16 PM

Chittoor – Cow : చిత్తూరు జిల్లాలో అత్యంత కర్కశానికి ఒడిగట్టాడో భూ యజమాని. అతి క్రూరంగా ఆవు కాలు నరికాడు. నోరు లేని మూగజీవి ఆకలితో మేత కోసం పొలంలోకి వెళితే అతి కిరాతకంగా కత్తితో ఆవు కాలిపై వేటు వేశాడు గాంధీ అనే వ్యక్తి. కార్వేటి నగరం మండలం డిఎంపురం గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది.

స్థానికంగా ఉన్న పుత్తూరు గోసంరక్షణ శాలలో వుండే నాలుగు ఆవులు మేత కోసం డీఎంపురం గ్రామంలోని మామిడి తోటలోకి వెళ్ళడంతో పొలం యజమాని గాంధీ ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. దీంతో.. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడు గాంధీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Attack On Cow

ఇలా ఉండగా, విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెంలో కలకలం రేగింది. బావ మహాలక్శ్మినాయుడుపై హత్యాయత్నం చేశాడు బావమరిది. ఇనుపరాడ్డుతో తలపై మోదాడు. తీవ్రగాయాలపాలైన మాహాలక్ష్మినాయుడును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Brother In Law

Read also : Fishing : సుందిళ్ళ బ్యారేజి దగ్గర చేపల కోసం పోటెత్తిన జనం.. కనువిందు చేస్తోన్న మత్స్య సంపద